Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CM Revanth Reddy :  మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి

RTV News 2 weeks ago

న్టీఆర్ దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడని, తెలుగుజాతికి సరికొత్త స్ఫూర్తిని నింపిన మహనీయుడని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. "దేశ చరిత్రను తిరగేస్తే సమాజానికి దిశా నిర్దేశం చేసిన స్ఫూర్తిదాయక నేతలు ముగ్గురే ముగ్గురు..

వారే అసలైన జాతిరత్నాలు అంటూ అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ పేర్లను ఆయన ప్రస్తావించారు. అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసగించారు.

మా ప్రభుత్వానికి ఇందిరమ్మ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఆశయాల కలయికే మా ప్రస్తుత ప్రజా పాలన అని సీఎం స్పష్టం చేశారు. ఆనాడు పేదల ఆకలి తీర్చడానికి, వారికి ఆత్మగౌరవం ఇవ్వడానికి ఎన్టీఆర్ మొదలు పెట్టిన పక్కా ఇళ్ల పథకమే.. ఈ నాడు మేము అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకమని తాను చాలా గర్వంగా చెబుతున్నానన్నారు. ఆ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి ప్రతి అడుగులోనూ తమ పాలనలో కనిపిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్స్ ఉండాలని ఆనాడు రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకుంటే..దాన్ని అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని సీఎం వెల్లడించారు.

తెలుగు జాతి గర్వించదగ్గ విషయం

మైత్రీవనం వంటి రద్దీ కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమని, ఆయన ఆశయాల సాధన కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నందమూరి అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu