Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫల్తా రీపోలింగ్‌..  లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!

ఫల్తా రీపోలింగ్‌.. లక్ష ఓట్ల తేడాతో BJP విక్టరీ!

RTV News 9 hrs ago

శ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఫాల్తా అసెంబ్లీ నియోజకవర్గంలో BJP భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా 1.09 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఘన విజయం సాధించగా, అధికార టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు.

ఈ ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిణామం చోటుచేసుకుంది. రీ-పోలింగ్ జరగడానికి కేవలం కొన్ని రోజుల ముందే టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే, అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోవడంతో ఈవీఎం మిషన్లలో ఆయన పేరు, గుర్తు అలాగే ఉండిపోయాయి. దీనిని ఆయన వ్యక్తిగత నిర్ణయంగా టీఎంసీ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ ప్రచారం పూర్తిగా ఆగిపోయింది. ఎన్నికల రోజున ఆయన ఇల్లు తాళం వేసి ఉండగా, టీఎంసీ కార్యకర్తలు ఎక్కడా కనిపించలేదు.

ముఖ్యమంత్రి సువేందు అధికారి ఫాల్తా నియోజకవర్గానికి ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నచ్చి, ప్రాంత ప్రయోజనాల కోసమే తాను తప్పుకుంటున్నట్లు ప్రచారంలో పుష్ప స్టైల్ ఇమేజ్తో దూసుకుపోయిన జహంగీర్ ఖాన్ తెలపడం గమనార్హం. ఈ భారీ విజయంపై సువేందు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు భయం లేకుండా, స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఇస్తే నిజమైన ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఈ ఫలితం నిరూపించిందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాను లక్ష ఓట్ల మెజారిటీ కోరానని, ఇక్కడి ప్రజలు అంతకంటే ఎక్కువే ఇచ్చి బీజేపీని గెలిపించారని చెబుతూ ఫాల్తా ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి ద్వారా ఈ రుణం తీర్చుకుంటానని, బంగారు ఫాల్తాను నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

బెదిరింపులకు పాల్పడుతూ

ఇదే క్రమంలో టీఎంసీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీఎంసీ ప్రజల సొమ్మును దోచుకుంటూ, బెదిరింపులకు పాల్పడుతూ ఒక మాఫియా కంపెనీలా మారిందని ఆరోపించారు. ఒక మోసగాడు పైనుంచి పారాచూట్లో వచ్చి ఇక్కడ కమాండర్లా బిల్డప్ ఇచ్చాడని. గతంలో ఎన్నికలను ఒక ఫార్స్లా మార్చారని మండిపడ్డారు. గత 15 ఏళ్లలో ఫాల్తా ప్రజలకు ఇప్పుడే ఓటు వేసే స్వేచ్ఛ దొరికిందని, రాబోయే రోజుల్లో టీఎంసీకి నోటాతో పోటీ పడే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu