Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ibrahimpatnam : టీ తాగుదామని తీసుకెళ్లి..బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం

Ibrahimpatnam : టీ తాగుదామని తీసుకెళ్లి..బీటెక్ విద్యార్థినిపై క్లాస్‌మేట్ అత్యాచారం

RTV News 5 days ago

Ibrahimpatnam: టీ తాగుదామని తీసుకెళ్లి..బీటెక్ విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారం

Ibrahimpatnam: హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో ఘోరg జరిగింది.

తోటి విద్యార్థినిని నమ్మించి, బలవంతంగా మద్యం తాగించి ఒక బీటెక్ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘోరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నమ్మించి కారులో తీసుకెళ్లి..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడుతల ఉదయ్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 14న రాత్రి, తన క్లాస్మేట్ అయిన ఒక విద్యార్థినిని "టీ తాగుదాం రా" అంటూ నమ్మించి తన కారులో దిల్సుఖ్నగర్కు తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి టీ తాగిన అనంతరం తిరిగి ఇబ్రహీంపట్నం వైపు ప్రయాణమయ్యారు.దిల్సుఖ్నగర్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఉదయ్ మధ్యలో మద్యం కొనుగోలు చేశాడు. అనంతరం కారును ఇబ్రహీంపట్నం పరిధిలోని బీడీఎల్ (BDL) రోడ్డులో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశంలోకి పోనిచ్చాడు. అక్కడ ఒంటరిగా ఉన్న సదరు విద్యార్థినికి బలవంతంగా మద్యం తాగించాడు. యువతి పూర్తిగా మద్యం మత్తులోకి జారుకుని నిస్సహాయ స్థితికి చేరుకోగానే.. ఆమెను ఇబ్రహీంపట్నంలోని ఒక గదికి తీసుకువెళ్లి క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టాడు.

మద్యం మత్తు వీడిన తర్వాత తనపై జరిగిన ఘోరాన్ని గ్రహించిన బాధితురాలు తీవ్ర మనస్తాపానికి, దిగ్భ్రాంతికి గురైంది. జరిగిన అన్యాయంపై ధైర్యంగా ముందడుగు వేసి, ఈ నెల 17న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నిందితుడు ఉదయ్పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదుతో తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సోమవారం నిందితుడు ఉడుతల ఉదయ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ మహేందర్రెడ్డి వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu