పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నప్పటికీ ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన 'హర్మూజ్ జలసంధి'(Hormuz) నుంచి భారత నౌకల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
తాజాగా భారత్కు చెందిన 'గ్రీన్ ఆశా' అనే ఎల్పీజీ (LPG) నౌక ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా దాటింది. శనివారం 'గ్రీన్ శాన్వి' ఈ రూట్ను దాటిన సంగతి తెలిసిందే. ఆదివారం గ్రీన్ ఆశా కూడా అదే బాటలో ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా హర్మూజ్ జలసంధి గుండా 9 LPG నౌకలు ప్రయాణించాయి.
అగ్రరాజ్యానికే చైనా 'AI' షాక్: ఇరాన్కు సీక్రెట్ డేటా.. అమెరికా సేనలపై డ్రాగన్ నిఘా!
Indian LPG Tanker
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న క్రమంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించిన సంగతి తెలిసిందే. దీంతో అంతర్జాతీయ నౌకల ప్రయాణాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇరాన్(iran war) ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మిత్రపక్ష దేశాల నౌకలను అడ్డుకుంటున్నప్పటికీ.. భారత్ వంటి మిత్రదేశాల నౌకలకు మాత్రం హర్మూజ్ దాటేందుకు పర్మిషన్ ఇస్తోంది. దేశీయ ఇంధన అవసరాల దృష్ట్యా భారత్ ఈ రూట్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
భారత్-పాక్ మధ్య క్షిపణి యుద్ధం: కోల్కతాను టార్గెట్ చేస్తామన్న పాక్.. భారత్ ‘బ్రహ్మాస్త్రం’ ఇదే!
గత నెలలో కూడా ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి లాంటి ట్యాంకర్లు లక్షలాది టన్నుల ఇంధనాన్ని భారత్కు తీసుకొచ్చాయి. గుజరాత్లోని ముంద్రా, కాండ్రా పోర్టులకు సురక్షితంగా చేరుకున్నాయి. వీటితో సహా ముడి చమురును తీసుకొస్తున్న జగ్ లాడ్కి, గ్యాసోలిన్ను మోసుకొస్తున్న జగ్ ప్రకాశ్ నౌకలు కూడా ఈ వ్యూహాత్మక మార్గంలో ప్రయాణం సాగిస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. భారత ఇంధన భద్రతను కాపాడటంలో ఈ నౌకలు భారత్కు రావడం కీలకంగా మారింది.

