Dailyhunt
ఇరాన్ ఓవరాక్షన్ వల్లే ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. రాత్రికి రాత్రే అమెరికా బీభత్సం...?

ఇరాన్ ఓవరాక్షన్ వల్లే ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. రాత్రికి రాత్రే అమెరికా బీభత్సం...?

RTV News 1 week ago

శ్చిమ ఆసియాలో యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్పై కన్నెర్ర చేశారు. కేవలం 24 గంటల్లోనే ఇరాన్ను పూర్తిగా అంతం చేస్తానంటూ ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇన్నాళ్లూ ఓపిక పట్టానని, కానీ ఇక సహనం నశించిందని ట్రంప్ హెచ్చరించారు.

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకే విధ్వంసం?
డొనాల్డ్ ట్రంప్ తన హెచ్చరికలో భయంకరమైన డెడ్లైన్ను విధించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటలకల్లా ఇరాన్లో అల్లకల్లోలం సృష్టిస్తానని, ఆ దేశంలోని అన్ని వంతెనలు, కీలకమైన విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తానని శపథం చేశారు. కాల్పుల విరమణ విషయంలో ఇరాన్ చేస్తోన్న 'ఓవరాక్షన్' వల్లే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. "ఒక్క రోజులోనే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుంది" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధం ముంగిట ఉన్నామనే సంకేతాలను ఇస్తున్నాయి.

అమెరికా ఆపరేషన్.. రంగంలోకి బాంబర్లు!
ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అమెరికా భారీ యుద్ధ సన్నాహాలు చేస్తోంది. ఈ ఆపరేషన్ కోసం 4 భారీ బాంబర్లు, 55 అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్స్, 64 ఫైటర్ జెట్స్, 13 రెస్క్యూ ఎయిర్ క్రాఫ్ట్స్, 48 ట్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

అయితే, అమెరికా రెస్క్యూ ఆపరేషన్ ముసుగులో ఇరాన్ దగ్గరున్న యురేనియం నిల్వలను దొంగిలించడానికి ప్లాన్ చేస్తోందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేస్తోంది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) దీటుగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు భ్రమల్లో బతుకుతున్నారని, ఇరాన్ ఇలాంటి బెదిరింపులకు భయపడదని తెగేసి చెప్పింది. ఇటీవల తమ పైలట్ను పట్టుకున్న వారికి ఇరాన్ ప్రభుత్వం బహుమతులు కూడా ప్రకటించింది. అదే సమయంలో, అమెరికాకు సమాచారం చేరవేసే వారిపై కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది.

కీలక మలుపు.. అమెరికా ఆఫీసర్ పట్టివేత!
ప్రస్తుతం ఉద్రిక్తతకు ప్రధాన కారణం.. ఇరాన్ ఒక అమెరికా మిలిటరీ ఆఫీసర్ను తమ అదుపులోకి తీసుకోవడం. "రెస్క్యూ ఆపరేషన్లో ఉన్న అమెరికా ఆఫీసర్ను మేము పట్టుకున్నాం. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం" అని ఇరాన్ ప్రకటించింది. తమ అధికారిని బంధించినందుకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu