Dailyhunt
ఇరాన్‌పై పచ్చి బూతులతో రెచ్చిపోయిన ట్రంప్.. 48 గంటలు డెడ్‌లైన్!

ఇరాన్‌పై పచ్చి బూతులతో రెచ్చిపోయిన ట్రంప్.. 48 గంటలు డెడ్‌లైన్!

RTV News 1 week ago

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ఇరాన్పై బూతులతో విరుచుకుపడ్డారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ట్రూత్ సోషల్లో సంచలన హెచ్చరికలు జారీ చేశారు.

మంగళవారం నాటికి జలసంధిని తిరిగి తెరవాలని, లేకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అల్టిమేటమ్ ఇచ్చారు.

తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేస్తూ ట్రంప్ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. "ఓరి పిచ్చి వెధవల్లారా, ఆ జలసంధిని వెంటనే తెరవండి. లేకపోతే మీరు నరకంలో బ్రతకాల్సి వస్తుంది.. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి!" అంటూ వార్నింగ్ ఇచ్చాడు. 48గంటలు అంటే మంగళవారం వరకు ఇరాన్కు డెడ్లైన్ విధించారు. మంగళవారాన్ని ఇరాన్లో "పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే"గా చెప్పుకొచ్చాడు. ఆ దేశ విద్యుత్ కేంద్రాలు, బ్రిడ్జ్లే టార్గెట్గా దాడులు ఉంటాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

గడువు ముగుస్తోంది.. 48 గంటలే సమయం!
మార్చి 21న ఇరాన్కు ఇచ్చిన 10 రోజుల గడువును గుర్తు చేస్తూ, ఇప్పుడు కేవలం 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. "ఒప్పందం కుదుర్చుకోవడమో లేదా జలసంధిని తెరవడమో చేయాలి. సమయం మించిపోతోంది.. వారిపై ప్రళయం విరుచుకుపడటానికి మరికొన్ని గంటలే ఉంది. ప్రైయిస్ ది అల్లా!" అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ గడువులోగా స్పందించకుంటే, ఇరాన్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్తో మొదలుపెట్టి అన్ని విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టేస్తానని ఆయన గతంలోనే హెచ్చరించారు.

ఇరాన్ దీటైన స్పందన
ట్రంప్ వాడిన అసభ్య పదజాలంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. థాయ్లాండ్లోని ఇరాన్ రాయబార కార్యాలయం 'X' వేదికగా ట్రంప్ను ప్రశ్నించింది. "కొంతమంది అమెరికన్లు బూతులు తిడతారని మాకు తెలుసు, కానీ అమెరికా అధ్యక్షుడిగా మీలోని శ్రేష్ఠమైన లక్షణం ఇదేనా? ప్రపంచానికి మీరు ఇలాగే ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారా?" అంటూ ఎద్దేవా చేసింది.

యుద్ధ నేరాల ముప్పు?
ట్రంప్ హెచ్చరికలపై అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశంలోని పౌర ఇంధన మౌలిక సదుపాయాలపై (విద్యుత్ ప్లాంట్లు వంటివి) దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం 'యుద్ధ నేరం'గా పరిగణించబడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మంగళవారం నాటి గడువు సమీపిస్తుండటంతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు హోర్ముజ్ జలసంధి వైపు ఉత్కంఠగా చూస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu