Dailyhunt
Iran AWS Attack: అమెజాన్‌పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. గల్ఫ్‌లో స్తంభించిన క్లౌడ్ సేవలు!

Iran AWS Attack: అమెజాన్‌పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. గల్ఫ్‌లో స్తంభించిన క్లౌడ్ సేవలు!

RTV News 2 weeks ago

Iran AWS Attack: మధ్యప్రాచ్యంలో యుద్ధం మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, ఇప్పుడు 'టెక్ వార్' రూపం దాల్చింది.

బహ్రెయిన్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో డేటా సెంటర్లోని సర్వర్లు తీవ్రంగా దెబ్బతినడంతో గల్ఫ్ రీజియన్ అంతటా క్లౌడ్ సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది.

నిఘా సాకుతో వినాశనం

అమెరికా, ఇజ్రాయెల్ దేశాల నిఘా సంస్థలకు, అలాగే వారి సైనిక కార్యకలాపాలకు ఈ డేటా సెంటర్లు కీలక సమాచారాన్ని అందిస్తున్నాయని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ కేంద్రాల ద్వారా తమ వ్యూహాలను పసిగడుతున్నారని భావించిన ఇరాన్, నేరుగా టెక్ మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుంది. దాడి ధాటికి గల్ఫ్ దేశాల్లోని అనేక వ్యాపార, ఐటీ కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి.

ఇండోనేషియాలో భారీ భూకంపం.. మలేషియా, ఫిలిప్పీన్స్కు సునామీ హెచ్చరికలు

అమెరికా టెక్ దిగ్గజాలపై 'టెర్రర్' ముద్ర
ఈ దాడికి ముందే ఇరాన్ ఒక సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన 18 సాఫ్ట్వేర్ దిగ్గజాలను ఇరాన్ ప్రభుత్వం 'టెర్రరిస్ట్ సంస్థలు'గా ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధానంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.

చరిత్ర సృష్టించిన NASA.. 50 ఏళ్ల తర్వాత చంద్రుడి చెంతకు మానవ యాత్ర

ముంచుకొస్తున్న ముప్పు
కేవలం ఈ ఒక్క దాడితోనే ఆగబోమని, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా టెక్ కంపెనీలన్నింటిపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కలకలం రేపుతోంది. అమెరికా, దాని మిత్రదేశాల డిజిటల్ భద్రతకు ఇది పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం బహ్రెయిన్లో దెబ్బతిన్న సర్వర్లను పునరుద్ధరించేందుకు అమెజాన్ నిపుణులు ప్రయత్నిస్తుండగా, యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu