Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IRAN :  ఇరాన్ సంచలన నిర్ణయం.. అమ్మాయిల చేతుల్లోకి ఏకే-47 తుపాకులు!

IRAN : ఇరాన్ సంచలన నిర్ణయం.. అమ్మాయిల చేతుల్లోకి ఏకే-47 తుపాకులు!

RTV News 6 days ago

మెరికా, ఇరాన్(iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎంతలా పెరిగిపోయాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్ తన దేశంలోని యువతీ యువకులకు పెద్ద ఎత్తున తుపాకులు వాడటంలో శిక్షణ ఇస్తోంది.

దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో యువకులు ఆయుధాలు ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడి అమ్మాయిలు కూడా ఈ శిక్షణలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

అమ్మాయిలు ఎంతో చాకచక్యంగా

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోలో ఇరాన్ అమ్మాయిలు ఎంతో చాకచక్యంగాAK-47 తుపాకీ భాగాలను విడదీయడం, మళ్లీ వాటిని అమర్చడం నేర్చుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లోకి యువకులు, పురుషులు పెద్ద సంఖ్యలో వచ్చి ఏకే-47 ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు. ఒకవేళ అమెరికా తమ దేశంపై భూతల దాడికి దిగితే, తమ మాతృభూమిని కాపాడుకోవాలనే ఆశతో సాధారణ ప్రజలు కూడా ఈ ఆయుధాలను ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇరాన్లోని పలు నగరాల్లో ఉన్న మసీదులలో పురుషులు, మహిళల కోసం తేలికపాటి ఆయుధాలను ఎలా వాడాలో నేర్పించే రక్షణ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు. దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలను సిద్ధం చేయడంలో ఇదొక భాగమని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఈ శిక్షణా కార్యక్రమాలను చూపిస్తూ ప్రకటించింది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. ఈ ఆత్మరక్షణ కార్యక్రమానికి జాన్ ఫిదా బరాయే ఇరాన్ (ఇరాన్ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధం) అని పేరు పెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్(israel) లతో జరుగుతున్న ప్రస్తుత ఘర్షణల నేపథ్యంలో దేశ పౌరులందరినీ ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుగా ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. టెహ్రాన్ ప్రజల నుండి ఈ నిర్ణయానికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పెద్ద సంఖ్యలో ఇరాన్ పౌరులు ఈ శిక్షణ కోసం తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 31 మిలియన్ల మంది ప్రజలు ఇందులో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా క్లెయిమ్ చేసింది.

ఇంతకుముందు కూడా ఇరాన్ టీవీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది. అందులో ఒక న్యూస్ యాంకర్ స్టూడియోలోనే ఏకే-47 తుపాకీ పట్టుకుని నిలబడగా, అతని ముందు మిలిటరీ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మిలిటరీ వ్యక్తి యాంకర్కు ఆ ప్రమాదకరమైన తుపాకీని ఎలా ఉపయోగించాలో లైవ్లో నేర్పిస్తూ కనిపించాడు. ఆ వీడియో బయటకు వచ్చినప్పటి నుండి, ఇప్పుడు ఇరాన్లోని మసీదులలో వీధుల్లో యువతకు ఈ రకమైన మిలిటరీ శిక్షణను ఇస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu