ఇరాన్‌పై మళ్లీ అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా యువ జంటలకు సామూహిక వివాహాలు చేస్తోంది.
రాజధాని టెహ్రాన్లో సోమవారం దాదాపు 1,000 జంటలకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆధ్వర్యంలో పెళ్లిల్లు జరిగాయి. ఈ వివాహాలను పర్షియన్ భాషలో "జౌజ్-ఎ-జాన్ఫిదా" అని అంటున్నారు.'త్యాగానికి అంకితమైన జంటలు' అని దీని అర్థం. ఇమామ్ హుస్సేన్ స్క్వేర్ లాంటి ప్రధాన కూడళ్లలో రాత్రి 8 గంటలకు ఈ జంటల ఊరేగింపు ప్రారంభమయ్యింది. అజాదీ స్క్వేర్ వరకు ఇది కొనసాగింది.
'వీధి కుక్కలు కనిపించకూడదు'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
షియా సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే ప్రవక్త అలీ, ప్రవక్త ఫాతిమాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇరాన్ సైన్యం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు శత్రువులను మానసికంగా నిరుత్సాహపరుస్తాయని, అలాగే ఇరాన్ యువతలో దేశభక్తి, త్యాగ స్ఫూర్తిని నింపుతాయని ఇరాన్ సైన్యం డిప్యూటీ కల్చరల్ చీఫ్ రహీమ్ నదాలీ పేర్కొన్నారు. ఇరాన్ పౌరులు తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నారని ప్రపంచానికి చాటిచెప్పే 'జన్-ఫాదా' ఉద్యమానికి కొనసాగింపుగానే IRGC ఈ సామూహిక వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వాహనాదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ఈ జాతీయవాద ప్రచారం కోసం IRGC అధికారికంగా janfadaa.ir అనే వెబ్సైట్ను కూడా ప్రారంభించింది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్లను అంతమొందిస్తామని ప్రతిజ్ఞ చేయడమే టార్గెట్గా ఈ ప్రచారం నడుస్తోంది. ఇరాన్ సైన్యం చేపట్టిన ఈ చొరవ దేశాన్ని ఏకం చేస్తోందని.. యువతలో ఇది ఉత్సాహాన్ని నింపుతూ సాంప్రదాయ వివాహాలను దేశభక్తితో అనుసంధానిస్తుందని IRGC మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.

