Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Iran-US War: ఇరాన్‌కు అయిదు కీలక షరతులు విధించిన అమెరికా..

Iran-US War: ఇరాన్‌కు అయిదు కీలక షరతులు విధించిన అమెరికా..

RTV News 1 week ago

మెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు జరిగిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్కు అమెరికా అయిదు కీలక షరతులు విధించింది. ఇందులో భాగంగా ఇరాన్ తన వద్ద ఉన్న 400 కిలోల యురేనియాన్ని అమెరికాకు అప్పగించాల్సి ఉంటుంది.

దేశంలో కేవలం ఒకే ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గతంలో విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక నష్టాలకు అమెరికా ఎలాంటి పరిహారం ఇవ్వదు. వివిధ దేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ప్రభుత్వ ఆస్తుల్లో 25 శాతం నిధులను కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతిని కొనసాగించడం కోసం మాత్రమే చర్చలు జరగాలని అమెరికా షరతులు విధించింది.

UAE అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఇరాన్ మళ్లీ దెబ్బకొట్టిందా ?

అమెరికా విధించిన ఈ ఏకపక్ష డిమాండ్లను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వీటికి ప్రతిగా ఇరాన్ కూడా తన సొంత షరతులను తీసుకొచ్చింది. లెబనాన్ సహా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అన్ని యుద్ధ రంగాల్లో వెంటనే శాంతిని నెలకొల్పాలి. ఇరాన్పై ఉన్న అన్ని అంతర్జాతీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి. విదేశాల్లో స్తంభించిన తమ నిధులన్నింటినీ తక్షిణమే రిలీజ్ చేయాలి. గత ఆంక్షల వల్ల ఇరాన్కు కలిగిన ఆర్థిక నష్టాలకు అమెరికా పరిహారం చెల్లించాలి. అంతర్జాతీయ ఇంధన వాణిజ్యానికి కీలకంగా ఉన్న 'హర్మూజ్ జలసంధి'పై తమ సార్వభౌమాధికారాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని ఇరాన్ షరతులు విధించింది.

రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు.. నలుగురు మృతి

ఈ ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్ శాంతి ముసుగులో యుద్ధాన్ని, ఉద్రిక్తతలను కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. ముందుగా సంక్షోభాన్ని సృష్టించి.. ఆ తర్వాత శాంతి చర్చల పేరుతో ఉద్రిక్తతలను మళ్లీ పెంచడం అమెరికా-ఇజ్రాయెల్ పాత పద్ధతి అంటూ విమర్శించారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ కూడా ఈ విషయంలో అమెరికాను హెచ్చరించారు. తాము ప్రతిపాదించిన షరతులకు అమెరికా ఒప్పుకోకుంటే.. దీనికి బదులు అమెరికా పన్ను చెల్లింపుదారులు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu