Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైలు ఖైదీలకి వీడియో కాల్ చేసుకునే సదుపాయం..

జైలు ఖైదీలకి వీడియో కాల్ చేసుకునే సదుపాయం..

RTV News 5 days ago

త్తీస్గఢ్ జైళ్లశాఖ ఖైదీల కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటి నుంచి దూరంగా జైల్లో ఉంటున్న ఖైదీలు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వీడియో కాలింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

రాయ్పుర్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిది. మదర్స్ డే సందర్భంగా 200 మంది మహిళా ఖైదీలున్న ఈ జైలులో ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించారు. దీని ద్వారా మహిళా ఖైదీలు నేరుగా తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో వీడియో కాలింగ్ మాట్లాడుతూ మానసిక ఉపశమనం పొందే వీలుంటుందని రాయ్పుర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ యోగేష్ క్షత్రి తెలిపారు.

ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయొద్దు.. సీఎం యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరిక

ఈ వీడియో కాలింగ్ వ్యవస్థ పారదర్శకంగా, బయోమెట్రిక్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందుకోసం ప్రతి మహిళా ఖైదీకి ఒక ప్రత్యేకమైన బయోమెట్రిక్ కార్డును జారీ చేస్తారు. ఖైదీలు తమ బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశాకే ఈ కాలింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సదరు ఖైదీ పేరు స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ సౌకర్యం కింద వారం రోజులకు గరిష్ఠంగా 5 నిమిషాల పాటు మాట్లాడుకునేందుకు పర్మిషన్ ఇస్తారు. ఇందుకోసం నిమిషానికి రూ. 5 చొప్పున చెల్లించాలి. ఖైదీలు తమ కార్డులో ఉన్న బ్యాలెన్స్ ఆధారంగానే ఈ కాల్స్ చేసుకోవచ్చు. కేటాయించిన 5 నిమిషాల సమయం ముగిశాక కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu