Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

RTV News 5 days ago

హారాష్ట్రలోని పుణేలో దారుణం చోటుచేసుకుంది. ఉన్నత చదువు చదువుకుని.. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళా లాయర్పైనే దుండగులు అఘాయిత్యానికి ఒడిగట్టారు.

పట్నాకు చెందిన ఆ మహిళా న్యాయవాది వ్యక్తిగత పనికోసం పుణేకు వచ్చారు. అక్కడ ఓ విలాసవంతమైన ఫైవ్స్టార్ హోటల్లో విడిది చేశారు. ఆదివారం రాత్రి హోటల్లోని పబ్లో ఉండగా పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులతో ఆమె మాటలు కలిశాయి. ఆ తర్వాత ఈ ముగ్గురు మరో పబ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

'వీధి కుక్కలు కనిపించకూడదు'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెల్లవారుజామున 1.30 గంటలకు కారులో వెళ్తుండగా వాళ్ల అసలు రంగు బయటపడింది. కదులుతున్న కారులోనే వాళ్లిద్దరిలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వాళ్లు మరో ఇద్దరు స్నేహితులను కూడా అక్కడికి పిలిపించారు. వచ్చిన ఆ మిగతా ఇద్దరు కూడా ఆ మహిళా లాయర్ను తీవ్రంగా లైంగిక వేధించారు. ఈ ఘటన తర్వాత చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

వాహనాదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

నిందితులపై పోలీసులు అత్యాచారం, లైంగిక వేధింపుల కింద కేసులు నమోదు చేసి రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, కారు నంబరు సాయంతో నిందితులను గాలించారు. ముగ్గురిని అరెస్టు చేశారు. పట్టుబడ్డ వాళ్లలో అభిషేక్ నవనాథ్ ముక్తే, ధనుంజయ్ సోర్టే, ఆదేశ్ శిందేలుగా గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న నాల్గొవ నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu