Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karnataka :  తీవ్ర విషాదం:  ఒకే కుటుంబంలో 11 మంది మృతి

Karnataka : తీవ్ర విషాదం: ఒకే కుటుంబంలో 11 మంది మృతి

RTV News 11 hrs ago

ర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీ విషాదం చోటుచేసుకుంది. నదిలో గుల్లలు ఏరుకోవడానికి వెళ్లిన వారిలో 11 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ప్రమాదంలో మరికొందరు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

నీటి ఉధృతికి

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. శిరాలీ పరిధిలోని శారదహోలె ప్రాంతానికి చెందిన 14 మంది సభ్యుల బృందం భట్కల్ సమీపంలోని వెంకటాపుర నదిలోకి దిగింది. నదిలో లభించే గుల్లలను సేకరిస్తుండగా, ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. తీవ్రమైన నీటి ఉధృతికి అందులో ఉన్నవారు కొట్టుకుపోయారు.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే భట్కల్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్థానిక అధికారులు, గ్రామస్థుల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. నీటిలో మునిగిపోతున్న కొందరిని సురక్షితంగా రక్షించి, చికిత్స కోసం భట్కల్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతదేహాలను వెలికితీశారు. అయితే, ఇంకా ఎంతమంది గల్లంతయ్యారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మిగిలిన వారి కోసం నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu