Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
kavitha : తమిళనాడులో విజయ్.. తెలంగాణలో నేనే.. కవిత సంచలన కామెంట్స్ !

kavitha : తమిళనాడులో విజయ్.. తెలంగాణలో నేనే.. కవిత సంచలన కామెంట్స్ !

RTV News 1 week ago

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక కామెంట్స్ చేసింది. జీవితంలో ఎన్నో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాతే, ప్రజల కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలనే బలమైన సంకల్పంతో ఈ పార్టీని స్థాపించినట్లు కవిత తెలిపారు.

కేవలం టైమ్ పాస్ చేయడానికి పార్టీ పెట్టలేదని, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గుణాత్మక మార్పు తేవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తమిళనాడులో విజయ్ లాగే తాను కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన కవిత ఈ కామెంట్స్ చేశారు.

కేసీఆర్ రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి అని కొనియాడుతూనే..ఉద్యమ కేసీఆర్తో సమస్య లేదు కానీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సమస్య ఉంది అని తండ్రి పాలనా తీరుపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయం తన తండ్రి దగ్గరే నేర్చుకున్నానని, అందుకే ఆయనను కూడా వ్యతిరేకించగలిగే ధైర్యం తనకు ఉందని చెప్పారు. సుష్మా స్వరాజ్, జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ వంటి వారు తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, ప్రస్తుత పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. లక్షల కోట్లు ఖర్చు చేసినా పాలమూరు - రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల ద్వారా చుక్క నీరు రాలేదని, ఫలితంగా వలసలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి RSS సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని RSS సీఎంగా అభివర్ణించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి ఉన్నారని, అందుకే బీజేపీని రేవంత్ ఏమీ అనడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా వ్యతిరేక ధోరణితో ఉందని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడి విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాలతో ప్రజల్లోకి వెళ్లి 2028 లేదా 2029లో అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

లిక్కర్ కేసు అనేది కేవలం బీజేపీ కుట్ర అని కవిత కొట్టిపారేశారు. కేజ్రీవాల్ వంటి నీతిపరుడిని అవినీతిపరుడిగా, కేసీఆర్ కూతురిని కల్చర్ లేని వ్యక్తిగా చిత్రీకరించడానికే ఈ కేసు పెట్టారని ఆరోపించారు. చివరికి నిజమే గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu