Dailyhunt
KCR బద్దశత్రువుకి MLA టికెట్.. తమిళనాడులో అన్నమలైకు BJP బిగ్ షాక్

KCR బద్దశత్రువుకి MLA టికెట్.. తమిళనాడులో అన్నమలైకు BJP బిగ్ షాక్

RTV News 0 months ago

క్షిణ భారత రాజకీయాల్లో పాగా వేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఈక్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక(Tamilnadu Assembly Elections) ల కోసం 27 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్ట్ శుక్రవారం విడుదల చేసింది.

ఈ లిస్ట్లో తెలంగాణ మాజీ గవర్నర్, కేసీఆర్ బద్ద శత్రువు తమిళిసై సౌందరరాజన్(tamilisai-soundararajan) కు చోటు కల్పించింది కమలం పార్టీ. ఈమె 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్రానికి రెండవ గవర్నర్ (మొదటి మహిళా గవర్నర్)గా నియామకం అయ్యారు. 2024 మార్చిలో తమిళి సై రాజీనామా చేశారు. ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు విభేదాలు వచ్చాయి.

KCR వర్సెస్ తమిళిసై

బిల్లు ఆమెదం, ఎమ్మెల్సీల నియామకం, ప్రొటోకాల్ లాంటి పలు విషయాల్లో తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం తనను అవమానిస్తోందని గవర్నర్(Former Telangana Governor) ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేయడం, దానికి ప్రతిగా మంత్రులు, బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరును తప్పుబడుతూ ప్రకటనలు చేయడం నిరంతరం సాగింది. గవర్నర్గా తెలంగాణకు రాకముందుకు 2019 లోక్సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. తమిళనాడులోని తూత్తుకుడి నియోజకవర్గం నుండి BJP తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె DMK అభ్యర్థి కనిమొళి కరుణానిధిపై పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాతే ఆమె తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

బరిలో ప్రముఖులు

బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సత్తూరు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ అవనాశి స్థానం నుంచి బరిలోకి దిగుతుండగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ కోయంబత్తూరు (ఉత్తర) నుంచి పోటీలో ఉన్నారు. వీరితో పాటు మోడక్కురిచి నుంచి కృతిక శివకుమార్, విలవన్కోడ్ నుంచి ఎస్. విజయధరణి, తళ్లి నుంచి నాగేష్ కుమార్లకు అవకాశం దక్కింది.

అన్నామలైకి నో ఛాన్స్

ఈ జాబితాలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, అందుకే పోటీకి దూరంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై పార్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు గానూ బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా పోటీ చేస్తున్నాయి. NDA పొత్తులో భాగంగా అన్నాడీఎంకే 169, బీజేపీకి 27, పీఎంకే (అన్బుమణి రామదాస్) 18, ఏఎంఎంకే (టీటీవీ దినకరన్) 11 స్థానాలు కేటాయించారు.

త్రిముఖ పోరు

ఈసారి తమిళనాడు ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అధికార డీఎంకే (DMK) కూటమి, ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమితో పాటు, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కూడా రంగంలోకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది. దక్షిణాదిలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న వెలువడనున్న ఫలితాలు తమిళనాడు భవిష్యత్తును తేల్చనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu