కోలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. దీని విషయంలో చాలా నెలలే ఆందోళనలు చెలరేగాయి.
రెండు కేసుల్లో..
అయితే ఇప్పుడు అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ , సీల్దా కోర్టు సందీప్ ఘోష్తో పాటూ అభిజిత్ మోండల్కి కూడా బెయిల్ దాఖలు చేసింది. ఇద్దరు నిందితులపై చార్జిషీట్ తప్పనిసరిగా 90 రోజుల వ్యవధిలో దాఖలు చేయనందుకే నిందితులకు బెయిల్ మంజూరు చేసినట్లు కోర్టు చెప్పింది. అయితే బెయిల్ లభించినప్పటికీ సందీప్ ఘోష్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. సందీప్ ఘోష్ మీద రెండు కేసులు నడుస్తున్నాయి. అందులో ఒకటి హత్యాచారం సాక్ష్యాలను తారుమారు చేయడం అయితే..మరొకటి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన ఆర్థిక అవకతవకలు మరొకటి. ఇప్పుడు హత్యాచారం కేసులో బెయిల్ వచ్చినా...ఆర్ధిక అవకతవకలు కేసులో మాత్రం సందీప్ ఘోష్ జ్యుడీషియల్ రిమాండ్లో ఉండాల్సిందే. దీంతో పోలీస్ ఆఫీసర్ అభిజిత్ మొండల్ మాత్రమే బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నారు.
Also Read: Allu Arjun: మేము దురుసుగా ప్రవర్తించలేదు– సెంట్రల్ జోన్ డీసీపీ
Also Read: Varma: దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా..అధికారులకు రాంగోపాలవర్మ ప్రశ్న

