Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. ఏసీబీ నోటీసులు

KTR: కేటీఆర్‌కు బిగ్ షాక్.. ఏసీబీ నోటీసులు

RTV News 1 week ago

KTR: హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఏసీబీ కోర్టు ఆయనతో పాటు పలువురు కీలక అధికారులకు సమన్లు జారీ చేసింది.

ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (ఏ2), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (ఏ3), స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు (ఏ4)లకు సమన్లు పంపించింది. వీళ్లందరూ జులై 31న విచారణకు వ్యక్తిగతంగా రావాలని ఆదేశాలు జారీ చేసింది.

నీట్ యూజీ పరీక్ష తేదీపై కీలక అప్డేట్

2023లో జరిగిన ఈ రేసు నిర్వహణ కోసం రూల్స్కు విరుద్ధంగా రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థకు మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ నిధుల మళ్లింపుపై ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపత్రంలో కీలక అంశాలను ACB ప్రస్తావించింది. ముందస్తు పర్మిషన్ లేకుండా భారీ మొత్తాన్ని విదేశీ సంస్థకు బదిలీ చేశారని, ఇందులో ప్రోటోకాల్ రూల్స్ను ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్తో పాటు మిగతా నిందితులను, ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. తాజాగా వీళ్లకు కోర్టు సమన్ల నేపథ్యంలో జూలై 31న జరిగే విచారణపై ఆసక్తి నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu