Dailyhunt
Lockup Deaths: సాతన్‌కుళం 'కస్టడీ' మారణకాండ.. ప్రైవేట్ పార్ట్స్‌పై రక్తం, ఆ రాత్రి ఏం జరిగింది?

Lockup Deaths: సాతన్‌కుళం 'కస్టడీ' మారణకాండ.. ప్రైవేట్ పార్ట్స్‌పై రక్తం, ఆ రాత్రి ఏం జరిగింది?

RTV News 1 week ago

మిళనాడు(tamilnadu) లోని సాతన్కుళం లోకప్ డెత్(lockup-death) కేసు దేశం మొత్తం మారుమోతుతోంది. అధికారంతో ఊగిపోయి పోలీసులు తండ్రీకొడుకుల ప్రాణాలను బలితీసుకున్నారు.

ఈ కేసులో మదురై సెషన్స్ కోర్టు ఆరేళ్లుగా కేసు విచారణ జరిపి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన ప్రజెంట్ వైరలవుతోంది.

2026 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు, అంటే కేవలం 74 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 170 కస్టడీ మరణాలు నమోదైనట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో చెప్పింది. వీటిలో బిహర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే.. దక్షిణాదిలో మాత్రం తమిళనాడు 7 మరణాలతో మొదటి స్థానంలో ఉంది.

ప్రశ్నించినందుకే ప్రాణాలు తీసిన పోలీసులు

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాతన్కుళం ఓ చిన్న టౌన్. అది 2020 జూన్, కోవిడ్ లాక్డౌన్ ఆంక్షల అమలులో ఉన్న రోజులవి. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కానీ, ఆ రాత్రి అక్కడి పోలీస్ స్టేషన్ గోడల మధ్య జరిగిన వికృత చేష్టలు, రక్తపాతం ఆరు ఏళ్ల తర్వాత నేడు భారత న్యాయచరిత్రలో ఓ మైలురాయిగా నిలిచాయి. సామాన్య పౌరులను రక్షించాల్సిన ఖాకీలే యమదూతలుగా మారి, ఒక తండ్రీకొడుకులను బలితీసుకున్న ఈ 'సాతన్కుళం కస్టడీ మరణాల' కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

ఒక చిన్న వాగ్వాదం.. ఒక పెద్ద విషాదం

31 ఏళ్ల జె. బెనిక్స్ సాతన్కుళంలో చిన్న మొబైల్ షాపు నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని తండ్రి 58 ఏళ్ల పి. జయరాజ్. ఆ రాత్రి 8 గంటల సమయంలో, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి షాపు తెరిచారన్న నెపంతో పోలీసులు జయరాజ్ను స్టేషన్కు తీసుకెళ్లారు. తండ్రిని ఎందుకు తీసుకెళ్లారని అడగడానికి వెళ్లిన బెనిక్స్ను కూడా పోలీసులు లోపలికి పిలిచారు. అలా వెళ్లిన వారు చావు దెబ్బలతో హాస్పిటల్లో చేరారు. ఆ క్షణమే వారి జీవితాల్లో చీకటి అధ్యాయం మొదలైంది.

పోలీసులు రాసిన ఎఫ్ఐఆర్లో వారు నేలపై దొర్లి గాయపడ్డారని, పోలీసులను చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ, పోలీసులు దాచిన అసలు నిజం భయంకరంగా ఉంది. పోలీస్ స్టేషన్ బయట బెనిక్స్ ఫ్రెండ్స్ వేచి ఉండగా, లోపల నుండి తండ్రీకొడుకుల అరుపులు వినిపించాయి. "తండ్రీకొడుకుల బట్టలు విప్పి లైగింకంగా హింసించారు. వారి ప్రైవేట్ పార్ట్పై దారుణంగా కొట్టారు. బాధితుల పోస్ట్మార్టం, మెడికల్ రిపోర్ట్లో వారి ప్రైవేట్ భాగాలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. లాఠీలతో, ఇతర వస్తువులతో ఆ ప్రాంతాల్లో దాడి చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. CID విచారణలో పోలీసులు వారిని పెట్టిన చిత్రహింసల గురించి చదివితేనే గుండె గల్లుమంటుదని జెడ్జ్మెంట్లో కోర్టు చెప్పుకొచ్చింది.

వారిని గంటల తరబడి లాఠీలతో ఘోరంగా కొట్టారు. తండ్రీకొడుకుల రక్తం పోలీసుల యూనిఫాంపై పడి వారు పదే పదే బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత హింస పెట్టారో అని. స్టేషన్లోని బల్లలు, లాఠీలపై పూర్తిగా రక్తపు మరకలు ఉన్నాయని ఓ మహిళా కానిస్టేబుల్ విచారణలో సాక్ష్యం చెప్పింది.

కస్టడీలో కన్నుమూత

జూన్ 19న వారిని అరెస్ట్ చేస్తే.. జూన్ 20న మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పోలీసులు తండ్రీకొడుకులకు ఎలాంటి మెడికల్ చెక్అప్ చేయకుండానే రిమాండ్కు పంపారు. తర్వాత వారిని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించారు. జూన్ 22 రాత్రి బెనిక్స్, మరుసటి రోజు ఉదయం జయరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అప్పటికే వారి శరీరాలు పోలీసుల రాక్షసత్వానికి చిధ్రమైపోయాయి.

వెల్లువెత్తిన నిరసన.. న్యాయపోరాటం

ఈ ఘటన కేవలం తమిళనాడునే కాక, యావత్ దేశాన్ని కుదిపేసింది. అమెరికాలోని 'జార్జ్ ఫ్లాయిడ్' మరణంతో దీన్ని పోల్చారు. సోషల్ మీడియాలో #JusticeForJayarajAndFenix హ్యాష్ ట్యాగ్ మార్మోగింది. మద్రాస్ హైకోర్టు స్వయంగా ఈ కేసును విచారణకు స్వీకరించి, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సుదీర్ఘ విచారణ తర్వాత మదురై జిల్లా కోర్టు ఈ కేసును రెరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుగా పరిగణించింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్తో పాటు మరో ఆరుగురుని దోషులు తేల్చింది. అత్యంత క్రూరంగా ప్రవర్తించినందుకు తొమ్మిది మంది పోలీసులకు కోర్టు మరణశిక్ష విధించింది.

కోర్టు వార్నింగ్

"అధికారం చేతిలో ఉందని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. రాష్ట్రంలోని నిజాయితీ గల పోలీసులకు గౌరవం ఇస్తూనే, ఇలాంటి అకృత్యాలకు పాల్పడే వారిలో భయం కలిగించడమే ఈ తీర్పు ఉద్దేశ్యం." ఈ తీర్పుతో జయరాజ్, బెనిక్స్ కుటుంబానికి కొంత ఊరట లభించినా, ఆ రాత్రి వారు అనుభవించిన నరకం మాత్రం భారత పోలీస్ వ్యవస్థలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu