Lokah Chapter 2: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్(Tovino Thomas) తన కొత్త సినిమా 'లోకా 2' గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ మూవీ తన కెరీర్లోనే అత్యంత కష్టమైన ప్రాజెక్ట్ అని ఆయన చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టోవినో ఈ సినిమా ప్రత్యేకతను వివరించారు. ఈ చిత్రంలో తాను ఏకంగా 389 విభిన్న రూపాల్లో కనిపించాల్సి ఉంటుందని చెప్పారు. అన్ని పాత్రలను ఒకే సినిమాలో ఎలా చూపించాలి అన్నది తనకే స్పష్టంగా తెలియదని ఆయన అన్నారు. అన్ని పాత్రలను పరిచయం చేయడానికే సినిమా పూర్తవుతుందేమో అనిపిస్తోందని, అందుకే కథను పూర్తిగా చెప్పడానికి ‘లోకా 3’ కూడా రావచ్చు అని తెలిపారు.
Lokah Chapter 2ఈ మూవీ స్క్రిప్ట్కు సంబంధించి ఇప్పటికే సిద్ధంగా ఉందని, దర్శకుడు డొమినిక్ అరుణ్తో తరచూ చర్చలు జరుగుతున్నాయని టోవినో చెప్పారు.
ఇప్పటికే 2025లో విడుదలైన ‘లోకా: చాప్టర్ 1’ మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో చంద్ర అనే పాత్ర చుట్టూ కథ తిరిగింది. బయటకు సాధారణంగా కనిపించే ఆమె అసలు రూపం ‘కల్లియంకట్టు నీళి’ అనే పౌరాణిక జీవి అని చివర్లో రివీల్ చేశారు. దీంతో కథలో మిస్టరీ పెరిగింది.
ఇప్పుడు ‘లోకా 2’లో ఆ కథను మరింత ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా టోవినో 389 పాత్రలతో ఎలా కనిపిస్తాడు? కథ ఎలా మలుపు తిరుగుతుంది? అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ 2026 డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, టోవినో థామస్ మరో సినిమా ‘పల్లిచట్టాంబి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న ఈ చిత్రం పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. గ్రామ ప్రజల కోసం పోరాడే ఒక వ్యక్తి కథను ఇందులో చూపించనున్నారు. ఇందులో కాయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది.
రానున్న రోజుల్లో ‘అతిరడి’ అనే మరో ప్రాజెక్ట్ కూడా టోవినో చేయబోతున్నారు. ఇందులో బేసిల్ జోసఫ్, వినీత్ శ్రీనివాసన్ కూడా నటించనున్నారు.
మొత్తంగా ‘లోకా 2’తో టోవినో థామస్ ఒక కొత్త రికార్డు సృష్టించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇండియన్ సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా నిలవొచ్చు.

