Dailyhunt
MARRIAGE SUICIDE : 5 రోజుల్లో పెళ్లి..ఇంతలోనే దారుణం

MARRIAGE SUICIDE : 5 రోజుల్లో పెళ్లి..ఇంతలోనే దారుణం

RTV News 5 days ago

MARRIAGE SUICIDE : మరో 5 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఆకస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. హైదరాబాద్ కోండాపూర్లోని మై హోం మంగళలో నివాసం ఉంటున్న వెంకట కృష్ణసాయికి ఇటీవలె పెళ్లి ఖాయమైంది.

అయితే ఇంతలోనే ఎమైందో తెలియదు కానీ, గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర విషాదం నెలకొంది.

అంతకు ముందు కృష్ణ సాయి..తన సోదరుడికి మెయిల్ పంపాడు. మెయిల్ చూసిన సోదరుడు వెంటనే మై హోం మంగళకు వచ్చి తలుపులు కొట్టినప్పటికీ అతను తీయకపోవడంతో.. డోర్స్ పగలగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే గోంతు కోసుకుని అపస్మారక స్థితిలో ఉన్న కృష్ణ సాయిని హాస్పిటల్కు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. కాగా, ఫిబ్రవరి 22న విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో వెంకట కృష్ణసాయికి ఎంగేజ్మెంట్ అయింది. మరో ఐదు రోజుల్లోనే పెళ్లి కావలసి ఉండగా అంతలోనే ఆత్మహత్యకు పాల్పడటం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.సోదరుడు సాయి పవన్ కల్యాణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu