మే 3న నిర్వహించిన నీట్ యూజీ పేపర్ లీక్ అయిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను రద్దు చేసింది.
అయితే ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ చివరివారంలో లేదా జులై ప్రారంభంలో ఈ పరీక్షను నిర్వహించే ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నీట్ పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు కుంగిపోవద్దని.. ధైర్యంగా మళ్లీ ప్రీపెర్ కావాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. త్వరలోనే ఈ పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
ఢిల్లీలో వర్క్ ఫ్రం హెం.. సీఎం రేఖా గుప్తా 10 కీలక ప్రకటనలు
ఇదిలాఉండగా మే 3న జరిగిన పరీక్షకు ముందే 'గెస్ పేపర్' పేరిట క్వశ్చన్ పేపర్ లీక్ అయిన సంగతి తెలసిందే. దీనికి సంబంధించిన ఆధారాలు లభించడంతో NTA మే 12న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ లీకేజీకి సంబంధించిన విచారణను కేంద్రం ఇప్పటికే సీబీఐకి అప్పగించింది. విచారణలో భాగంగా పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఒక్కో పేపర్ను రూ.5 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. దీంతో ఈ అక్రమాల వెనుకున్న నెట్వర్క్ను ఛేదించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఇక విద్యార్థులు తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను అనుసరించాలని అధికారులు సూచించారు.

