Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi: 'ఎమోషన్‌తో విజిల్స్ వేస్తారు'.. 'పెద్ది' సినిమాపై బుచ్చిబాబు కామెంట్స్ వైరల్!

Peddi: 'ఎమోషన్‌తో విజిల్స్ వేస్తారు'.. 'పెద్ది' సినిమాపై బుచ్చిబాబు కామెంట్స్ వైరల్!

RTV News 1 week ago

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న 'పెద్ది' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సాన Buchi Babu Sana తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి.

సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో మాస్ సీన్లు వస్తే ప్రేక్షకులు ఉత్సాహంతో విజిల్స్ వేస్తారు. కానీ 'పెద్ది' సినిమాలో మాత్రం ఎమోషన్స్ తో కళ్లలో నీళ్లు వచ్చినా కూడా ప్రేక్షకులు విజిల్స్ వేస్తారని బుచ్చి బాబు తెలిపారు.

తాను ఈ సినిమా సన్నివేశాలను అలాంటి ఎమోషన్‌తో రాశానని ఆయన చెప్పారు. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని తెలిపారు.

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు సాన చెప్పిన మాటలతో అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu