Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Peddi: 'పెద్ది' బ్యాటింగ్ షురూ.. సెలబ్రిటీస్ స్పెషల్ విషెస్!

Peddi: 'పెద్ది' బ్యాటింగ్ షురూ.. సెలబ్రిటీస్ స్పెషల్ విషెస్!

RTV News 4 months ago

Peddi: రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ చిత్రం 'పెద్ది' కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, ఇప్పటికే ప్రీమియర్ షోల సందడి మొదలైంది.

ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

రామ్ చరణ్ కష్టానికి వరుణ్ తేజ్ ప్రశంసలు

మెగా హీరో వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా పోస్టులో రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతగా శ్రమించాడో తనకు తెలుసని చెప్పారు. పని పట్ల చరణ్ చూపించే అంకితభావం అందరికీ స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్తో పాటు మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘పెద్ది’ భారీ విజయాన్ని అందుకోవాలని కోరారు.

చరణ్ నటనపై నమ్మకం: సమంత

నటి సమంత కూడా ‘పెద్ది’పై తన ఆసక్తిని వ్యక్తం చేసింది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది. రామ్ చరణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఆయన చాలా ప్రతిభ కలిగిన నటుడని పేర్కొంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని చెప్పిన సమంత, సినిమా బ్లాక్బస్టర్ అవుతుందనే మంచి ఫీలింగ్ తనకు ఉందని తెలిపింది.

అనిల్ రావిపూడి ప్రశంసలు

దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ‘పెద్ది’ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందని అన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ చేసిన శారీరక మార్పు, పాత్ర కోసం చూపించిన కృషి ఎంతో ప్రత్యేకమని చెప్పారు. సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించి, చాలా కాలం గుర్తుండిపోయే చిత్రంగా నిలవాలని ఆకాంక్షించారు.

‘మెగా 158’ టీమ్ నుంచి స్పెషల్ విషెస్

ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘మెగా 158’ సినిమా బృందం కూడా ‘పెద్ది’ టీమ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. షూటింగ్ జరుగుతున్న లొకేషన్ నుంచి వీడియో విడుదల చేసి రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా, వృద్ధి సినిమాస్ నిర్మాణ సంస్థకు ఆల్ ది బెస్ట్ చెప్పింది.

మొత్తంగా ‘పెద్ది’ విడుదలకు ముందు సినీ ప్రముఖుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. అభిమానులు కూడా ఈ సినిమాను పెద్ద తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu