Peddi Special Song: 'పెద్ది' సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మూవీ టీమ్ ప్రమోషన్స్ డోస్ పెంచింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాకు బుచ్చిబాబు సన బుచ్చిబాబు సాన Buchi Babu Sana దర్శకత్వం వహిస్తున్నారు.
రేపు భోపాల్‌లో ఈ సినిమా భారీ మ్యూజికల్ ఈవెంట్ జరగనుండగా, మూవీ టీమ్ అభిమానులకు ఒక పెద్ద అప్డేట్ ఇచ్చింది.
సినిమాలో ఉండే స్పెషల్ సాంగ్‌కు సంబంధించిన వివరాలను తాజాగా ప్రకటించారు. "హెల్లల్లలో" అనే టైటిల్‌తో ఈ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ Shruti Haasan, జాన్వీ కపూర్ Janhvi Kapoor కలిసి కనిపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ పాటపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఈ పాటకు ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ Anantha Sriram సాహిత్యం అందించగా, ఆస్కార్ విజేత A. R. రెహమాన్ A. R. Rahman సంగీతం సమకూర్చారు. రేపు జరగబోయే మ్యూజికల్ ఈవెంట్‌లో ఈ సాంగ్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. అంతకుముందే ఈరోజు పాటకు సంబంధించిన చిన్న ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
ముఖ్యంగా శృతి హాసన్ ఈ పాటలో ఎలా కనిపించబోతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో హీరోయిన్ కూడా ఈ పాటలో కనిపిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ Shiva Rajkumar, జగపతి బాబు Jagapathi Babu, బొమన్ ఇరానీ Boman Irani, దివ్యేందు శర్మ Divyenndu Sharma తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ Vriddhi Cinemas నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ Mythri Movie Makers, సుకుమార్ రైటింగ్స్ Sukumar Writings సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది.

