Peddi Ticket Hike: రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం తెలుస్తోంది.
నైజాం ఏరియాలో టికెట్ రేట్లు పెంచేందుకు అవకాశం లేకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సమాచారం ప్రకారం, సినిమా టీమ్ టికెట్ ధరల పెంపు కోసం రెండు సార్లు హోం సెక్రటరీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అనుకూల స్పందన రాకపోవడంతో, చివరికి ఈ విషయాన్ని హైకోర్టుకు తీసుకెళ్లినట్లు సమాచారం.
కానీ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఆధారంగా చేసుకుని ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్ర బృందం తమ పిటిషన్ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో “పెద్ది” సినిమా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సాధారణ టికెట్ రేట్లకే విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పవన్ కళ్యాణ్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే విడుదలైన విషయం తెలిసిందే.
ఇప్పుడు అందరి దృష్టి అధికారిక ప్రకటనపైనే ఉంది.

