Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prabhas Fauzi: 'ఫౌజీ' షూటింగ్ కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!

Prabhas Fauzi: 'ఫౌజీ' షూటింగ్ కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!

RTV News 3 weeks ago

Prabhas Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas నటిస్తున్న కొత్త సినిమా 'ఫౌజీ' షూటింగ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. దర్శకుడు హను రాఘవపూడి Hanu Raghavapudi రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

షూటింగ్ లొకేషన్‌కు వెళ్లేందుకు ప్రొడక్షన్ టీమ్ ప్రయాణిస్తున్న వాహనం హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

'దళపతి' టూ 'సీఎం' విజయ్.. విక్టరీతో మారిన 'జన నాయకన్' టైటిల్..!

ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే స్థానికులు సహాయం చేసి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.

'గిల్లి' నుంచి 'లియో' వరకు.. విజయ్-త్రిష హిట్ ట్రాక్ రికార్డ్ ఇదే!

ఈ ఘటనతో సినిమా యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

'ఫౌజీ' సినిమాలో కథానాయికగా ఇమాన్వి Imaanvi నటిస్తుండగా, జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ Mythri Movie Makers నిర్మిస్తోంది. దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu