Dailyhunt
Prabhas Kalki 2: స్పీడ్ పెంచేసిన ప్రభాస్ ఒకవైపు 'స్పిరిట్', మరోవైపు 'కల్కి 2'!

Prabhas Kalki 2: స్పీడ్ పెంచేసిన ప్రభాస్ ఒకవైపు 'స్పిరిట్', మరోవైపు 'కల్కి 2'!

RTV News 1 week ago

Prabhas Kalki 2: ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు. సమ్మర్ బ్రేక్ తర్వాత ఆయన రేపటి నుంచి హైదరాబాద్లో జరుగుతున్న "కల్కి 2898 AD" సీక్వెల్ షూటింగ్కి హాజరవుతున్నారని సమాచారం.

హైదరాబాద్ బయట భారీ సెట్ను నిర్మించారు. ఈ కొత్త షెడ్యూల్లో కొన్ని ముఖ్యమైన సీన్స్ షూట్ చేయనున్నారు.

ప్రభాస్ మొదటిసారి ఈ సీక్వెల్ సెట్స్లో పాల్గొనబోతున్నారు. మే నెలలో ఈ సినిమా కోసం ఆయన ఎక్కువ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ “ఫౌజీ”కి ప్రీక్వెల్ ప్లాన్స్.. ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా!

గత ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, ఇతర కమిట్మెంట్స్, సమ్మర్ బ్రేక్ కారణంగా ప్రభాస్ ఇప్పటివరకు షూట్కి రాలేదు. ఇప్పటివరకు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్కు సంబంధించిన కొన్ని కీలక సీన్స్ పూర్తయ్యాయి.

ముందు భాగంలో దీపికా పదుకోణ్ చేసిన “సుమతి” పాత్రకు ఇప్పుడు సాయి పల్లవి ఎంపికయ్యారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అలాగే కమల్ హాసన్, ఇతర ప్రధాన నటులు మొదటి భాగంలో ఉన్నవారు ఈ సీక్వెల్లో కూడా కొనసాగుతారని సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన "స్పిరిట్" మేకర్స్!

ఇక ప్రభాస్ త్వరలోనే “ఫౌజీ” షూట్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. తర్వాత “స్పిరిట్”(Spirit) సెట్స్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాల రిలీజ్ డేట్స్పై స్పష్టత త్వరలో రానుంది.

ఇదిలా ఉంటే, ఫ్యాన్స్లో మరో బజ్ కూడా ఉంది. ప్రభాస్ ఇవాళ రాత్రి నుంచే షూట్కి హాజరవుతారని, కొన్ని రోజులు షూట్లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu