Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajinikanth :  విజయ్తో నన్ను పోల్చొద్దు..  నేను పార్టీ పెడితే గెలిచేవాడ్ని :  రజనీకాంత్

Rajinikanth : విజయ్తో నన్ను పోల్చొద్దు.. నేను పార్టీ పెడితే గెలిచేవాడ్ని : రజనీకాంత్

RTV News 1 week ago

మిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత తనపై వస్తున్న వదంతులపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. విజయ్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి తాను తెరవెనుక రాజకీయాలు చేశానన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు.

"విజయ్‌ను అడ్డుకుని, డీఎంకే - అన్నాడీఎంకే పార్టీలను కలపడానికి రాయబారాలు నడిపే అంత దిగజారిన వ్యక్తిని కాదు ఈ రజనీకాంత్" అని ఆయన ఆవేశం వ్యక్తం చేశారు. చెన్నైలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో రజనీ మాట్లాడారు.

ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయిన తర్వాత మాజీ సీఎం ముక స్టాలిన్‌ను రజనీకాంత్ కలిశారు. దీనిపై రజనీ క్లారిటీ ఇస్తూ.. రాజకీయాలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా స్టాలిన్‌తో నాకు 40 ఏళ్ల స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే ఆయనను ఓదార్చడానికి వెళ్లాను. కానీ దీన్ని కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు.

సీఎం అయితే నాకెందుకు

విజయ్ విజయంపై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. విజయ్ ఒంటరిగా పోటీ చేసి అద్భుత విజయం సాధించారు. గతంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి మహానాయకులు సాధించిన దానికంటే పెద్ద విజయం ఇది. ప్రజలు మార్పు కోరుకుంటున్న సమయంలో విజయ్ వచ్చారని కొనియాడారు. తనకు అసూయ లేదన్నారు. అసలు నేను రాజకీయాల్లోనే లేను. విజయ్‌కు నాకు 28 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. ఆయన సీఎం అయితే నాకెందుకు అసూయ ఉంటుంది? ఆయన గెలవగానే ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపానని స్పష్టం చేశారు. అసలు విజయ్ తనకు సమవుజ్జి కాదని, కమల్ హాసన్ సీఎం అయివుంటే అసూయ పడేవాడినన్నారు. విజయ్ తో తనను పోల్చడం తప్పని రజినీకాంత్ చెప్పకొచ్చారు. 2021 లో తాను పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినే అని రజనీకాంత్ పేర్కొన్నారు.

విజయ్ పెట్టిన తమిళగ వెట్రి కజగం'(TVK) పార్టీ కార్యకర్తలు ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలని రజనీ సూచించారు. కార్యకర్తలు చేసే చిన్న పొరపాటైనా అది నేరుగా విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని, ప్రజలకు విజయ్ మంచి చేస్తారనే నమ్మకం తనకు ఉందని రజనీకాంత్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu