Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rupee Value: RBI మాస్టర్ ప్లాన్.. పుంజుకున్న రూపాయి విలువ

Rupee Value: RBI మాస్టర్ ప్లాన్.. పుంజుకున్న రూపాయి విలువ

RTV News 3 days ago

త 8 రోజులుగా వరుసగా నష్టాలను ఎదుర్కొంటున్న భారత రూపాయి విలువ ఎట్టకేలకు మళ్లీ పుంజుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ట్రేడింగ్లో గురువారం అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 52 పైసలు బలపడి, రూ.96.30 వద్ద ఆగింది.

దేశీయ కరెన్సీ పతనాన్ని నివారించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) రంగంలోకి దిగింది. 5 బిలియన్ డాలర్ల (దాదాపు 500 కోట్ల డాలర్లు) విలువైన స్టాక్స్ వేలాన్ని అధికారికంగా ప్రారంభించడమే రూపాయి వేగంగా కోలుకోవడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ'.. మొదలైన జెన్ Z తిరుగుబాటు

మార్కెట్లో డాలర్ల లభ్యత పెంచి, రూపాయిపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు RBI చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య ఫలితాలను ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అలాగే మార్కెట్లో డాలర్ల కొరత తీరడం వల్ల రూపాయి విలువ శరవేగంగా పుంజుకుంది. ఇక రానున్న రోజుల్లో కేంద్ర బ్యాంక్ మరిన్ని సానుకూల చర్యలు తీసుకుంటే.. డాలర్తో పోలిస్తే రూపాయిమరింత బలోపేతం అయ్యే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu