Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shocking Video : మణికొండలో మహిళపట్ల అసభ్య ప్రవర్తన..పోలీసులకు చిక్కిన నీచుడు

Shocking Video : మణికొండలో మహిళపట్ల అసభ్య ప్రవర్తన..పోలీసులకు చిక్కిన నీచుడు

RTV News 1 day ago

Shocking Video :హైదరాబాద్‌ మణికొండలో కలకలం రేపిన మహిళపై అసభ్య ప్రవర్తన కేసును నార్సింగి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే..?

మే 14వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఒక మహిళ తన రెండున్నరేళ్ల చిన్నారిని సమీపంలోని ప్లే స్కూల్ నుండి తీసుకుని ఇంటికి కాలినడకన బయలుదేరింది. ఆ సమయంలో రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఆ మహిళను ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిన్ రోడ్డు నుంచి నిశ్శబ్దంగా వెంటాడాడు. సమీపంలో ఎవరూ లేని సమయం చూసి, వెనుక నుంచి ఒక్కసారిగా వచ్చి ఆమె దుస్తులను పైకి లాగుతూ అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. ఊహించని ఈ ఘటనతో షాక్‌కు గురైన సదరు మహిళ గట్టిగా కేకలు వేయడంతో, భయపడిన నిందితుడు అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు.

ఈ అవమానకర ఘటనపై మే 19న బాధిత మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు BNS సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, నిందితుడు మహిళను వేధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నగరవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. నిందితుడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా గాలించారు.సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితుడిని వడ్డే నాగరాజు (26) గా గుర్తించి, ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.నిందితుడి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా, నవాబ్‌పేట్ మండలం, చాకలిపల్లి గ్రామం అని పోలీసులు తెలిపారు. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, పుప్పాలగూడలో నివాసం ఉంటున్నాడు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో గట్టిగా విచారించగా, తానే ఆ నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు.

కాగా, "మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని. ఒంటరి మహిళలు, పిల్లలతో రోడ్లపై వెళ్లేవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని నార్సింగి పోలీస్ ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu