కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో ఊహించని మలుపు తిరిగింది. పల్లవి, వేణుగోపాల్ అనే యువతీ యువకులకు పెద్దలు కుదిర్చిన పెళ్లి వేడుక చివరి ఘట్టానికి చేరుకుంది.
వధువు మెడలో వరుడు తాళి కట్టే సమయంలో ఒక్కసారిగా ఆమె అడ్డు చెప్పింది. దీంతో కల్యాణ మండపంలో ఉన్నవాళ్లందరూ కుంగుతిన్నారు. తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేకే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానంటూ భావోద్వేగానికి గురైంది.
దేశభక్తిని చాటుకున్న సీమా హైదర్.. కొడుకుకు 'భరత్' అనే పేరుతో నామకరణం
తల్లిదండ్రులు, బంధువులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె వినలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో వరుడు వేణుగోపాల్ చూపిన పనితీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. పల్లవి పరిస్థితిని అర్థం చేసుకున్న అతడు.. నేరుగా ఆమె అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాడు. ఆమె ఇష్టం లేదని చెప్పడంతో తన అభిప్రాయానికి గౌరవం ఇచ్చాడు. బలవంతపు పెళ్లి వల్ల ఇద్దరి జీవితాలు నాశనం చేసుకోవడం కన్నా.. ఆమె నిర్ణయాన్ని గౌరవించడమే సరైందని భావించాడు. అక్కడికక్కడే పెళ్లిని రద్దు చేస్తున్నట్లు చెప్పాడు.
విజయ్‌కు బిగ్‌షాక్.. నామినేషన్లు చెల్లవా ?.. ఎన్నికల అఫిడవిట్లలో తేడాలు
వేణుగోపాల్ చూపించిన సంస్కారానికి సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎదుటివాళ్ల ఇష్టాన్ని గౌరవించడమే నిజమైన మగాడి లక్షణం అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు ఈ విషయం ముందే చెప్పి ఉంటే ఇరు కుటుంబాలకు ఇలా ఇబ్బందులు ఉండేవి కావు కదా అంటూ వధువు తీరును తప్పుబడుతున్నారు. మరికొందరు బతికిపోయావ్ బ్రో అంటూ బ్లూ డ్రమ్ సీన్లను గుర్తు చేస్తున్నారు. ఆర్య లాంటి సినిమాటిక్ రేంజ్‌లో జరిగిన ఈ 'రియల్ లైఫ్' ఘటనలో వరుడు ప్రదర్శించిన సహనం, మానవత్వం ఇప్పుడు చర్చనీయమవుతోంది.

