Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TDP :  మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

TDP : మహానాడు నిర్వహణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

RTV News 1 week ago

హానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించినప్పటికీ, తాజా మార్పుల ప్రకారం ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు.

ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడు జరగనుంది. ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో (ఫిజికల్ , వర్చ్యువల్) నిర్వహిస్తున్నారు.

పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, స్టేట్ కమిటీ మెంబర్లు, అధికార ప్రతినిధులు మాత్రం నేరుగా ఆఫీసుకే వచ్చి పాల్గొంటారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాల నుంచే ఆన్లైన్లో జాయిన్ అవుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1848 క్లస్టర్ల నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ ఆన్లైన్ ద్వారానే ఈ వేడుకలో భాగస్వాములయ్యేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక మారినా, పద్ధతి మారినా.. మహానాడులో జరిగే పొలిటికల్ చర్చలు, తీర్మానాలు మాత్రం ఎప్పటిలాగే పక్కాగా జరుగుతాయని పార్టీ నాయకులు చెబుతున్నారు.

మే 29వ తేదీ షెడ్యూల్ రద్దు

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యల్లో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఆన్లైన్/హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. నెల్లూరులో ప్లాన్ చేసిన మే 29వ తేదీ షెడ్యూల్ రద్దయ్యింది. ఇప్పటికే లోకేశ్ ఆధ్వర్యంలో 19 కమిటీలు రంగంలోకి దిగాయి. వేదిక మార్పు నేపథ్యంలో మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో పొలిట్ బ్యూరో సభ్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలు, హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మహానాడులో ప్రధానంగా పదేళ్ల రాష్ట్ర అభివృద్ధి విజన్ (విజన్ 2034), కేంద్రం నుంచి వచ్చే నిధులు, కూటమి ప్రభుత్వం చేపట్టిన పునర్నిర్మాణ పనులపై తీర్మానాలు చేయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu