తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. గురువారం ఒక్కరోజే తెలంగాణలో వడదెబ్బకు గురై 22 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
ముఖ్యంగా వరంగల్ జిల్లాలోనే ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. తెలంగాణలోని ముత్తారం, మునగాల ప్రాంతాల్లో 46.5 డిగ్రీల మేర ఎండలు దంచికొట్టగా.. మరో 25 ప్రాంతాల్లో 45 డిగ్రీల మార్కును దాటేశాయి. ఇక ఏపీలో చూసుకుంటే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్టంగా 48.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది.
పుల్వామా పాపానికి ముగింపు.. పీవోకేలో కరడుగట్టిన ఉగ్రవాది హతం!
ఇక రాబోయే మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎండల ప్రభావం ఇలాగే ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందుకే ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట బయటకు రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగినంత నీరు తాగాలని.. గొడుగు లేదా టోపీ ధరించడం లాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

