Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TN Elections: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!

TN Elections: ఆటో డ్రైవర్ To అసెంబ్లీ.. ఇది మామా విక్టరీ అంటే..!

RTV News 1 month ago

మిళనాడు అసెంబ్లీ ఎన్నిక(Tamilnadu Assembly Elections) ల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుంది. ఓ సామాన్య ఆటో డ్రైవర్ రాజకీయ ఉద్ధండులైన DMK, AIADMK అభ్యర్థులను మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయ్(tvk vijay) దాము అనే సాధారణ ఆటో డ్రైవర్ TVK పార్టీ నుంచి రాయపురం నియోజకవర్గంలో బరిలోకి దిగారు. దాదాపు 55 వేల ఓట్లు సాధించిన దాము.. తన సమీప అభ్యర్థిపై 14,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఒక సామాన్యుడు బలమైన వ్యక్తులపై గెలవడాన్ని చూసి నెటినజ్లు, రాజకీయ నిపుణులు ఇదొక అద్భుతమంటూ కొనియాడుతున్నారు. సామాన్య ఆటో డ్రైవర్ను కూడా ఎన్నికల్లో గెలిపించిన రాయపురం నియోజకవర్గం ప్రజలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ గెలుపు అనేది కేవలం ఒక్క స్థానానికే మాత్రమే పరిమితం కాకుండా.. తమిళనాడు రాజకీయాల్లో పాతుకుపోయిన బలమైన వారసత్వ రాజకీయాలకు ఓ హెచ్చరిక ఇచ్చినట్లు అయ్యింది. రాయపురం నియోజకవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు డి. జయకుమార్ మూడో స్థానానికే పరిమితం అయ్యారు. DMK అభ్యర్థి సుబైర్ ఖాన్ రెండో స్థానంలో నిలిచారు. AIADMKకు కంచుకోట అయిన రాయపురంలో కొత్తగా వచ్చిన టీవీకే పార్టీ అభ్యర్థి గెలపు సంప్రదాయ పార్టీల బలానికి చెక్ పెట్టింది.

Also read: ఆ విషయంలో పవన్, KCR ఫెయిల్.. విజయ్ సక్సెస్.. ఇంట్రెస్టింగ్ న్యూస్!

Chennai Auto Driver Beats DMK, AIADMK Wins Royapuram For TVK Party

విజయ్ దాము.. విజయ్ మక్కల్ ఇయక్కం (అభిమాన సంఘం)లో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. అలాగే గ్రౌండ్ లెవల్లో ప్రజలతో మమేకమవుతుండేవారు. ప్రజల్లో ఉండటమే ఆయనకు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చింది. అంతేకాదు అభ్యర్థి ప్రకటన సమయంలో కూడా పార్టీ అధినేత విజయ్ని దాము కౌగిలించుకుని కంటతడి పెట్టిన ఫొటో కూడా విపరీతంగా వైరల్ అయ్యింది. టీవీకే పార్టీ ‘సామాన్యుడి గొంతుక’ అనే నినాదానికి ఓ ప్రతీక అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. ఈ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ బలాన్ని గ్రామస్థాయి సమస్యలతో అనుసంధానించడం, ముఖ్యంగా మత్స్యకారులకు ఇచ్చిన హామీలు ఓటర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం టీవీకే 108 స్థానాల్లో లీడింగ్ ఉంది. రాయపురంలో ఆటో డ్రైవర్ గెలవడం టీవీకే పార్టీ సామాన్యుడి గొంతుక అనే సంకేతాన్ని ఇచ్చింది. ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి వెళ్తున్న విజయ్ దాము ప్రస్థానం అందరినీ ఆకట్టుకుకోవడం విజయ్ సృష్టించిన రాజకీయ సునామీకి అద్దం పడుతోంది. టీవీకే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్.. చాలావరకు కొత్త వాళ్లకే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వీళ్లే అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. తమిళనాడులో మొదటిసారిగా పోటీ చేసిన టీవీకే ప్రభుత్వాన్ని చేపట్టే దిశగా వెళ్లడం చూస్తుంటే రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ఓటర్ల తీర్పు స్పష్టంగా కనిపిస్తోంది.

Also read: 15 ఏళ్ల దీదీ పాలనకు ముగింపు.. బీజేపీకి విజయానికి దారితీసిన 10 ప్రధాన కారణాలు ఇవే !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu