తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్కు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల ఆయన రెండుచోట్ల నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ఎన్నికల అఫిడవిట్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి బరిలోకి దిగనున్నారు.
ఇందులో భాగంగానే మార్చి 30న పెరంబుర్ స్థానానికి విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లో తనపై ఎలాంటి పెండింగ్ కేసులు లేవని ఆయన తెలిపారు. మూడు రోజుల తర్వాత ఏప్రిల్ 2న తిరుచి ఈస్ట్ స్థానానికి నామినేషన్ వేశారు. ఈసారి మాత్రం తనపై రెండు FIRలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకదాంట్లో కేసులు లేవని.. మరో దాంట్లో కేసులు ఉన్నట్లు చూపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ దాఖలు చేసిన నామినేషన్లలోని కేసు వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నేనేం తప్పు చేశాను.. పార్టీ నుంచి తొలగించాక రాఘవ్ చడ్డా సంచలన వ్యాఖ్యలు
Nomination Trouble For TVK Chief Vijay
ఎన్నికల రూల్స్ ప్రకారం చూసుకుంటే ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇస్తే తీవ్రమైన విషయంగా పరిగణిస్తారు. ఈ తేడాలు ఉంటే విజయ్ పెరంబుర్ స్థానంలో దాఖలు చేసిన నామినేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసకోవాల్సి ఉంది. ఒకవేళ విజయ్ నామినేషన్ రిజెక్ట్ అయితే టీవీకే పార్టీకి భారీ దెబ్బ తగలనుంది.
ఇదిలాఉండగా తమిళనాడులో ఏప్రిల్ 6తో నామినేషన్ల గడువు ముగియనుంది. 7వ తేదీన స్క్రూటీని జరగనుంది. అయితే ఈ గడువులోగా సవరించిన అఫిడవిట్లు సమర్పిస్తేనే విజయ్ సేఫ్గా ఉంటారు. రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సవరణలు చేయకుంటే ఒక స్థానంలోని నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళనాడులో 234 స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
అంతరిక్షంలోనూ అవుట్లుక్ తిప్పలు.. చంద్రుడి వైపు వెళ్తూ సాఫ్ట్వేర్ కష్టాలు!

