Dailyhunt
UAEలో ఇరాన్ దాడులు.. అయిదుగురు భారతీయులు.. ?

UAEలో ఇరాన్ దాడులు.. అయిదుగురు భారతీయులు.. ?

RTV News 3 weeks ago

శ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండగా.. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది.

ఈ క్రమంలోనే శుక్రవారం యూఏఈ రాజధాని అబుదాబిలోని గ్యాస్ప్లాంట్పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ క్షిపణులను యూఏఈ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయి. దీంతో క్షిపణి శకలాలు కిందపడటంతో 12 మందికి గాయపడ్డారు. ఈ విషయాన్ని అబుదాడి మీడియా కార్యాలయం వెల్లడించింది.

అమెరికా యుద్ధ విమానాలు నేటమట్టం.. పైలట్ కోసం ఇరాన్ గాలింపు

ఈ 12 మందిలో అయిదుగురు భారతీయులు ఉన్నట్లు తెలిపింది. మిగతా ఆరుగురు నేపాల్ పౌరులని పేర్కొంది. ప్రస్తుతం వాళ్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారని అబుదాబి మీడియా తెలిపింది. మార్చి 26న కూడా అబుదాబిలోని స్వీహాన్ ప్రాంతంలో క్షిపణి శకలాలు పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఒకరు భారతీయుడు కాగా మరోకరు పాకిస్థాన్కు చెందిన వ్యక్తి.

పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్.. భారత్ లో మందుబాబులకు BIG షాక్!

ఇదిలాఉండగా కువైట్లోని ప్రధాన చమురుశుద్ధి కర్మాగారమైన మీనా అల్-అహ్మదిపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశాయి. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ వెల్లడించింది. అయితే ప్రపంచంలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో కువైట్లో ఉన్న మీనా అల్-అహ్మది కూడా ఒకటి. కువైట్లో ఉత్పత్తి అయ్యే చమురుకు ఈ కర్మాగారం చాలా కీలకం. దీన్ని టార్గెట్ చేసుకోని ఇరాన్ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu