Dailyhunt
US Army Chief : ట్రంప్ ఒక పిచ్చివాడు.. అమెరికా మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

US Army Chief : ట్రంప్ ఒక పిచ్చివాడు.. అమెరికా మాజీ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

RTV News 6 days ago

మెరికా సైన్యంలో పెను సంచలనం నమోదైంది. యుద్ధం జరుగుతున్న సమయంలోనే ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ను ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు.

సాధారణంగా యుద్ధం నడుస్తున్నప్పుడు ఇలాంటి కీలక అధికారులను మార్చడం చాలా అరుదు. రాండీ జార్జ్ తన పదవీ కాలం ముగియడానికి ఏడాది కంటే ఎక్కువ సమయం ఉండగానే, తక్షణమే పదవి విరమణ చేస్తున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. ఆయనతో పాటు మరో ఇద్దరు కీలక జనరల్స్ను కూడా మంత్రి హెగ్సెత్ విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.

ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఇరాన్తో యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ఈ మార్పులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది కూడా కొందరు ఉన్నతాధికారులను మార్చిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా ఆర్మీ చీఫ్ను తీసేయడం వెనుక బలమైన కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్పై దాడుల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ కీలకంగా ఉన్నప్పటికీ, భూతల దాడుల కోసం సుమారు 4.5 లక్షల మంది సైన్యం ఉన్న ఆర్మీ విభాగం చాలా ముఖ్యం. ఇప్పటికే వేలాది మంది ఆర్మీ సైనికులు మధ్య ప్రాచ్యానికి చేరుకుంటున్నారు.

ట్రంప్ పై కీలక కామెంట్స్

ఈ క్రమంలో అమెరికా మాజీ ఆర్మీచీఫ్ ట్రంప్ పై కీలక కామెంట్స్ చేశారు. ట్రంప్ ను ఓ పిచ్చివాడిగా ఆయన సంభోదించారు. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా సైన్యం క్రెడిబిలిటీ దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆరోపించారు. దేశాల మధ్య రిలేషన్స్ దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు. ఇరాన్పై యుద్ధం విషయంలో ట్రంప్ది వ్యూహం ఏమాత్రం కాదన్నారు జ అమెరికా అధ్యక్షుడి హోదాలో తీసుకున్న పిచ్చి నిర్ణయాలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. మిడిల్ ఈస్ట్ మంటల కారకులను చరిత్ర ఎప్పటికీ మరిచిపోదని ఆయన హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu