అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చైనా(china) అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాట్లాడుతూ అమెరికా పతనం అంచున ఉందని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన ట్రంప్.. జిన్పింగ్ అభిప్రాయంతో తాను 100 శాతం ఏకీభవిస్తానని తెలిపారు. ఈ పతనం మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో జరిగిందని విమర్శలు చేశారు. బైడెన్ పాలనలో బహిరంగ సరిహద్దులు, అత్యధిక పన్నులు, వాణిజ్య ఒప్పందాలు విఫలం కావడం, నేరాలు పెరిగిన కారణంగా అమెరికా చాలా నష్టపోయిందని తెలిపారు. ఆయన హయాంలో దేశం నిజంగానే క్షీణదశలో ఉందని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు.. నేటి నుంచి అమల్లోకి
Agree ‘100%’ With Xi Jinping That U.S. Was On Decline
మరోవైపు తన 16 నెలల పదవీకాలంలో దేశం అసాధారణమైన పురోగతిని సాధించిందనట్లు ట్రంప్ ట్రూత్ సోషల్లో తెలిపారు. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరడం, కొత్త పెట్టుబడులు రావడం, వెనెజువెలాలో సైనిక విజయం, ఇరాన్పై కొనసాగుతున్న సైనిక చర్యలు తన పాలనలో సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలోనే ఇన్ని అద్భుతాలు సాధించినందుకు గాను జిన్పింగ్ తనను విమర్శలు చేయకుండా.. అభినందించాలని ట్రంప్ చెప్పుకొచ్చారు.
తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దు.. ట్రంప్కు జిన్పింగ్ 'వార్నింగ్'
రెండేళ్ల క్రితం అమెరికా పతనం అంచునా ఉందని.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా తమ దేశం అవతరించిందని ట్రంప్ పేర్కొన్నారు. గతంతో పోల్చిచూస్తే చైనాతో తమ సంబంధాలు ఇప్పుడు మరింత బలంగా, మెరుగ్గా ఉన్నాయన్నారు. బైడెన్ కాలం నాటి 'నిద్రమత్తు' పాలన ముగిసిందని.. ఇప్పుడు అమెరికా మళ్లీ పుంజుకుందని రాసుకొచ్చారు. ఇదిలాఉండగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవద్దని జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

