తమిళనాడులో టీవీకే పార్టీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తంజావూరు నియోజకవర్గంలోని రాజకీయాలు ఆసక్తిగా మారాయి. తంజావూరు నుంచి గెలిచిన టీవీకే ఎమ్మెల్యే మద్యం మత్తులో చిందులు వేస్తూ కనిపించడం దుమారం రేపుతోంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతోంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కాబోతున్న సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి తన సన్నిహితులతో కలిసి ఇలా మద్యం తాగుతూ చిందూలు వేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా అంటూ విమర్శిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవి చేపట్టనుండగా ఇలా ప్రవర్తించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. - tvk vijay
Newly Elected TVK MLA Caught Dancing

