Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1వ తరగతి నుంచి PG వరకు చదువుతున్న విద్యార్థులకు 'పరివర్తన్ ECSS ప్రోగ్రాం 2026-27'

1వ తరగతి నుంచి PG వరకు చదువుతున్న విద్యార్థులకు 'పరివర్తన్ ECSS ప్రోగ్రాం 2026-27'

SAKSHI EDUCATION 1 week ago

సాక్షి ఎడ్యుకేషన్: Parivartan ECSS Programme 2026-27 స్కాలర్‌షిప్‌ పథకం ద్వారా ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సహాయం అందించనున్నారు.

1వ తరగతి నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వరకు చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్య, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్‌, అండర్‌గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు విద్యా స్థాయిని బట్టి గరిష్టంగా రూ.75,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కు అక్టోబర్ 31, 2026 నాటికి కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

Parivartan ECSS (Educational Crisis Scholarship Support) Programme అనేది ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సహాయం అందించే స్కాలర్‌షిప్‌ కార్యక్రమం. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు ఈ పథకం ఉపయోగపడుతుంది.

ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి:

  • 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు.
  • డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్‌ కోర్సులు చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అండర్‌గ్రాడ్యుయేట్‌ (జనరల్‌, ప్రొఫెషనల్‌ కోర్సులు) విద్యార్థులు అర్హులు.
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ (జనరల్‌, ప్రొఫెషనల్‌ కోర్సులు) విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గత అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి కలిపి రూ.2.5 లక్షలకు మించకూడదు.
  • దరఖాస్తుదారు భారతీయ పౌరుడు అయి ఉండాలి.

గమనిక: గత మూడు సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లేదా కుటుంబపరంగా ఎదురైన సంక్షోభం కారణంగా చదువు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

  • విద్యా స్థాయిని బట్టి విద్యార్థులకు ఆర్థిక సహాయం అందుతుంది.
  • గరిష్ట స్కాలర్‌షిప్‌ మొత్తం: రూ.75,000 వరకు
  • దరఖాస్తు చివరి తేదీ: 31 అక్టోబర్ 2026
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే
  • దరఖాస్తు లింక్: www.b4s.in/yeks/HDFC63
  • QR Code: https://dle9eg0t055l3.cloudfront.net/static/images/scho-media/parivartan-ecss-programme-2026-271786449527.png
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education