Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2021లోనూ మంచి ప్యాకేజ్ ఇస్తున్న రంగాలపై ఆ సర్వేలు ఏం చెబుతున్నాయి..?

2021లోనూ మంచి ప్యాకేజ్ ఇస్తున్న రంగాలపై ఆ సర్వేలు ఏం చెబుతున్నాయి..?

SAKSHI EDUCATION 5 years ago

2020 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోల్చితే ద్వితీయార్థంలో ఈ సంస్థలు రికవరీ బాట పట్టాయి. ఫలితంగా నియామకాల్లో సానుకూల ధోరణి కనిపిస్తోంది. నైపుణ్యాలుంటే మంచి వేతనాలు ఇవ్వడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నాయని సర్వేలు పేర్కొన్నాయి. అలాగే మార్కెటింగ్, కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, డేటా అనలిస్ట్ ప్రొఫైల్స్‌లో నియామకాలకు డిమాండ్ కొనసాగుతోంది. వీటిలో ఆయా ప్రొఫైల్స్‌కు అనుగుణంగా రూ.8లక్షల నుంచి రూ.30లక్షల వరకు వార్షిక వేతనం అందించేందుకు సంస్థలు సానుకూలంగా స్పందిం చాయని సదరు సర్వేలు స్పష్టం చేశాయి.

ఇంటర్నెట్, ఈ-కామర్స్..
ప్రస్తుతం ఆకర్షణీయ వేతనాలు అందించడంలో ముందు నిలుస్తున్న మరో రంగం..

ఇంటర్నెట్ అండ్ ఈ-కామర్స్. అన్ని రంగాల్లో ఆన్‌లైన్ కార్యకలాపాలు, డిజిటలైజేషన్ ఊపందుకోవడంతో ఇంటర్నెట్, ఈ-కామర్స్ రంగాలు వృద్ధి బాట పట్టాయి. వినియోగదారులు వస్తువుల కొనుగోలుకు ఈ-కామర్స్ సంస్థలను వేదికగా చేసుకుంటున్నారు. అందుకోసం ఇంటర్నెట్‌ను మార్గంగా ఎంచుకుంటున్నారు. ఈ-కామర్స్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసిన వారు పేమెంట్స్‌ను కూడా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. దీంతో ఈ-కామర్స్ కార్యకలాపాలతోపాటు ఇంటర్నెట్ ట్రాఫిక్ కూడా పెరుగుతోంది. ఫలితంగా ఇంటర్నెట్, ఈ-కామర్స్‌లు ఉద్యోగ కల్పనతోపాటు వేత నాలు అందించడంలో టాప్‌లో నిలుస్తున్నాయి. ఇంటర్నెట్ అండ్ ఈ-కామర్స్ రంగంలో జూనియర్ స్థాయిలో రూ.8లక్షల నుంచి రూ.12లక్షల వరకు; సీనియర్ లెవల్‌లో రూ.30 లక్షల వరకు వేతనాలను సంస్థలు అందిస్తున్నాయి.

ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్..
కోవిడ్ సమయంలో డిమాండ్ పెరిగిన మరో రంగం.. ట్రాన్స్‌పోర్ట్,లాజిస్టిక్స్. వినియోగదారులు ఇచ్చిన ఆర్డర్స్‌కు అనుగుణంగా నిర్దిష్ట సమయంలోగా వస్తు సేవలను చేరవేయాల్సి ఉంటుంది. అందుకు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ సమర్థంగా పనిచేయాలి. ఈ క్రమంలోనే ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్ విభాగాలు కీలకంగా మారాయి. దీంతో సంస్థలు ఈ విభాగంలో పనిచేసే నిపుణులకు ఆకర్షణీయ వేతనాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఈ రంగంలో నియామకాలు కూడా ఆశాజనకంగా మారాయి. ఇదేతీరు కొత్త సంవత్సరంలోనూ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. నైపుణ్యాలుంటే.. జూనియర్ లెవల్‌లో రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకు వార్షిక వేతనాలు లభించే వీలుంది. అలాగే ఈ రంగంలో స్పెషలైజ్డ్ సర్టిఫికెట్లు (డిప్లొమా ఇన్ సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ-సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్ తదితర) ఉన్న వారికే నియామకాల్లో సంస్థలు ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వే నివేదిక ద్వారా తెలుస్తోంది.

ఇంకా చదవండి: part 3: రానున్న రోజుల్లో ఈ రంగాల్లో ఉద్యోగ వెల్లువ ..: ఐఐటీ చెన్నై ప్లేస్‌మెంట్ అడ్వైజర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education