Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
2482 Jobs: డిగ్రీ అర్హతతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే అవకాశం!

2482 Jobs: డిగ్రీ అర్హతతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే అవకాశం!

SAKSHI EDUCATION 2 months ago

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • మొత్తం పోస్టుల సంఖ్య: 2,482
  • పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)
  • తెలంగాణ: 50 పోస్టులు
  • ఆంధ్రప్రదేశ్: 80 పోస్టులు

లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (Degree) పూర్తి చేసి ఉండాలి.
  • షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఒక సంవత్సరం పోస్ట్‌ క్వాలిఫికేషన్‌ అనుభవం ఉండాలి.
  • అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.

01 ఆగస్టు 2026 నాటికి:

  • కనీస వయస్సు: 21 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందుతుంది.

  • బేసిక్ పే: రూ.48,480 నుంచి రూ.85,920 వరకు
  • దీనితో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.

Bank of Baroda LBO Recruitment 2026 ఎంపిక ప్రక్రియలో:

  • ఆన్‌లైన్ పరీక్ష
  • సైకోమెట్రిక్ టెస్ట్
  • భాషా నైపుణ్య పరీక్ష
  • గ్రూప్ డిస్కషన్ (GD) / ఇంటర్వ్యూ దశల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ ద్వారా
07 సెప్టెంబర్ 2026
వెబ్‌సైట్: bankofbaroda.bank.in

>> 1538 SBI Clerk Jobs: SBIలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. డిగ్రీ అర్హతతో Junior Associate పోస్టులు!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education