అదే సమయంలో డిజిటల్ హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, డయాగ్నస్టిక్స్, బయోఫార్మా వంటి కొత్త విభాగాలు కూడా ఉద్యోగ అవకాశాలను విస్తరిస్తున్నాయి.
సరైన విద్య, ప్రాక్టికల్ నైపుణ్యాలు, టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటే.. ఆరోగ్య రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో... హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లో జాబ్ ట్రెండ్స్‌పై ప్రత్యేక కథనం..
భారత ఫార్మా పరిశ్రమ 2024-25లో రూ.4.72 లక్షల కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంతేకాకుండా ప్రపంచానికి జనరిక్ మందుల ప్రధాన సరఫరాదారుగా కొనసా గుతోంది. 2026లోనూ ఆసుపత్రులు, ఫార్మా కంపెనీలు, డయాగ్నస్టిక్ సంస్థలు, హెల్త్‌టెక్ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. బయోఫార్మా పరిశోధన, తయారీ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలతో నిపుణుల అవసరం ఏర్పడింది. అందుకే డాక్టర్లు, నర్సులు మాత్రమే కాదు.. ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, బయోటెక్నాలజీ నిపుణులు, క్లినికల్ రీసెర్చర్లు, డేటా అనలిస్టులు, హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ నిపుణులు, ఏఐ-హెల్త్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌కూ అవకాశాలు పెరుగుతున్నాయి.
దేశంలో హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లో 2030 నాటికి 20 లక్షల నుంచి 25 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. తాజా సర్వే ప్రకారం-ఈ రంగాల్లోని పలు విభాగా ల్లో నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాల్లో వృద్ధి, డిజిటల్ హెల్త్ దిశగా అడుగులు వేయడం, ఫార్మా డెవలప్‌మెంట్ అండ్ మాన్యు ఫ్యాక్చరింగ్‌లో అంతర్జాతీయ ఔట్ సోర్సింగ్ పెరగడమే ఇందుకు కారణం. డయాగ్నస్టిక్స్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్, టెలిమెడిసిన్ కార్యకలాపాలు వృద్ధి బాటలో పయనిస్తుండటం కూడా అవకాశాల విస్తరణకు దోహదం చేస్తోంది.
ఇటీవల ఓ ప్రముఖ స్టాఫింగ్ సంస్థ విడుదల చేసిన సర్వే అంచనాల ప్రకారం-
- డయాగ్నస్టిక్స్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్, టెలి మెడిసిన్ విభాగంలో-20 నుంచి 25 శాతం; ∙అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీలో-25 నుంచి 30 శాతం;
- ఫార్మా ఫార్ములేషన్ డెవలప్‌మెంట్, ప్రాసెస్ ఇంజనీరింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, రెగ్యులేటరీ అఫైర్స్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్‌లో-22 నుంచి 25 శాతం; మెడికల్ డివైజెస్, మెడ్‌టెక్‌లో-20 శాతం మేర ఉద్యోగావకాశాల్లో వృద్ధి నమోదు కానుంది.
- హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లోనూ టెక్ ఆధారిత కార్యకలా పాలు ఊపందుకున్నాయి. దీంతో వీటికి సంబంధించిన ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మెడికల్ కోడింగ్, హెల్త్‌కేర్, డేటా అనలిటిక్స్, టెలిమెడిసిన్ సపోర్ట్ విభాగాల్లో 20 నుంచి 25 శాతం మేరకు నియామకాలు పెరగనున్నాయి.
- అదే విధంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) కూడా నియామకాల వృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఈ రంగానికి సంబంధించి ఏర్పాటైన జీసీసీల్లో మూడు లక్షల మంది నిపుణులున్నారు. ఈ సంఖ్య రానున్న అయిదేళ్లలో ఏడెనిమిది లక్షలకు చేరుకుంటుందని అంచనా.
1599 Railway Jobs: 10వ తరగతి, ఐటీఐ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. త్వరగా దరఖాస్తు చైయండి!
- ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో నియామకాల్లో ఫ్రెషర్స్‌కు ఆశావాహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం నియా మకాల్లో 55 నుంచి 60 శాతం మేరకు ఎంట్రీ లెవల్‌లో ఫ్రెషర్స్‌తోనే భర్తీ చేస్తున్నారు. నర్సులు, ల్యాబ్ టెక్నీషి యన్స్, పారా మెడిక్స్, ఫార్మాస్యుటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేట్స్, ఫీల్డ్ సేల్స్ ప్రొఫెషనల్స్ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.
- మిడిల్ లెవల్‌లో 30 నుంచి 35 శాతం మేర నియా మకా లకు సంబంధించి క్లినికల్ రీసెర్చ్, రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి.
- ఉన్నత స్థాయిలోనూ 10 నుంచి 12 శాతం మేర నియామకాల్లో వృద్ధి నమోదు కానుంది. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మెడికల్ అఫైర్స్, రెగ్యులేటరీ లీడర్‌షిప్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్‌లలో ఈ ఉద్యోగాలు ఉంటున్నాయి.
- క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్, ఫార్మకోవిజిలెన్స్, కాంట్రాక్ట్ రీసెర్చ్/కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్లలో నియంత్రణ వ్యవహారాలు చూసే నిపుణులకు 30 నుంచి 40 శాతం మేర డిమాండ్ పెరగనుంది. క్లినికల్, డిజిటల్ డేటా నైపుణ్యాలున్న హైబ్రీడ్ ప్రొఫెషనల్స్ నియామకాల దిశగా కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి.
ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల్లో నియామకాలతో పాటు వేతనాల్లోనూ వృద్ధి నమోదవనుంది. క్లినికల్, హాస్పిటల్ విభాగాల్లో మూడు నుంచి అయిదేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు; బయో టెక్నాలజీ, క్లినికల్ రీసెర్చ్, హెల్త్‌కేర్ డేటా అనలిటిక్స్ విభాగాల్లోని నిపుణులకు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వార్షిక వేతనాలు లభిస్తున్నాయి. అదే విధంగా రెగ్యులేటరీ అఫైర్స్, డిజిటల్ హెల్త్, గ్లోబల్ క్లినికల్ ఆపరేషన్స్ విభాగాల్లోని నిపుణులకు 20 నుంచి 30 శాతం మేరకు వేతనాలు పెరగనున్నాయి. మిడిల్, సీనియర్ లెవల్ ఉద్యోగాల్లో ప్రతి ఏటా 10 నుంచి 15 శాతం మేరకు వేతనాలు పెరుగుతాయి.
హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయంగా మన దేశ నిపుణులకు డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలు, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో మన నిపుణులకు డిమాండ్ 25 శాతం నుంచి 30 శాతం పెరగనుందని అంచనా. దీంతో ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, అనుబంధ వైద్య విభాగాల్లో ప్రొఫెషనల్స్ నియామకాలు భారీగా జరగనున్నాయి.
- ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు క్లినికల్, ఎల్డర్ కేర్, టెలి మెడిసిన్ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
- ఫార్మసీలో బీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేసిన వారు, ఈ రంగంలో రీసెర్చ్ చేసిన వారు ఎంట్రీ లెవల్‌లో ఫార్మసిస్ట్ నుంచి ఉన్నత స్థాయిలో ఆర్ అండ్ డీ సైంటిస్ట్ వంటి హోదాలకు సరితూగుతారు.
- మెడికల్ కోడింగ్, డిజిటల్ హెల్త్‌లో రాణించడానికి లైఫ్ సైన్సెస్‌లో డిగ్రీతోపాటు సీపీఏ, సీసీఎస్, సీపీసీ వంటి సర్టిఫికేషన్లు దోహదపడతాయి.
- నీట్-యూజీ ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య కోర్సుల్లో అడుగు పెట్టొచ్చు.
- రాష్ట్రాల స్థాయిలో ఈఏపీ సెట్(బైపీసీ) ఉత్తీర్ణతతో బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ కోర్సుల్లో చేరొచ్చు.
- బీఎస్సీ తర్వాత పీజీసెట్, సీయూఈటీ-పీజీ, నైపర్- జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా ఎంఫార్మసీ, ఇతర లైఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.
- బ్యాచిలర్ డిగ్రీ తర్వాత క్యాట్, ఐసెట్‌లలో ఉత్తీర్ణతతో ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో చేరొచ్చు.
- ఇంటర్మీడియెట్ అర్హతతో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. వీటికోసం రాష్ట్రాల స్థాయిలో పారా మెడికల్ బోర్డ్‌లు ప్రవేశ ప్రక్రియ చేపడతాయి.
ఫార్మా సెక్టార్‌లో టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌కు కూడా అవకాశా లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి సాంకేతిక అర్హతలు ఉన్న వారి కోసం సంస్థలు అన్వేషణ సాగి స్తున్నాయి. వీరికి కూడా ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నా యి. సగటున నెలకు రూ.50 వేల వరకు వేతనం ఖాయంగా కనిపిస్తోంది.
Apprentice Jobs: 10వ తరగతి, ఐటీఐ అర్హతతో 162 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!
భారత ఫార్మా రంగం
- భారత ఫార్మాస్యుటికల్ పరిశ్రమ ప్రపంచంలో కీలక స్థానంలో ఉంది.
- 2024-25లో భారత ఫార్మా పరిశ్రమ టర్నోవర్ సుమారు రూ.4.72 లక్షల కోట్లు.
- ప్రపంచానికి జనరిక్ మందుల ప్రధాన సరఫరాదారుల్లో భారత్ ఒకటి.
- ఫార్మా తయారీ, పరిశోధన, బయోఫార్మా రంగాల్లో కొత్త అవకాశాలు పెరుగుతున్నాయి.
ఈ రంగం ఎందుకు వేగంగా వృద్ధి చెందుతోంది?
- అధునాతన వైద్య సేవల విస్తరణ
- కొత్త ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు
- బయోటెక్నాలజీ, బయోఫార్మా రంగాల అభివృద్ధి
- డిజిటల్ హెల్త్ సేవల విస్తరణ
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుదల
- వైద్య పరిశోధనలకు ప్రాధాన్యం పెరగడం
- జనరిక్ మందులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్
ముఖ్యమైన ఉద్యోగాలు
- డాక్టర్లు
- నర్సులు
- ఫార్మసిస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్లు
- బయోటెక్నాలజీ నిపుణులు
- బయోఫార్మా నిపుణులు
- హెల్త్‌కేర్ డేటా అనలిస్టులు
- క్లినికల్ రీసెర్చ్ నిపుణులు
- హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ నిపుణులు
- హెల్త్‌టెక్ నిపుణులు
- ఏఐ-హెల్త్‌కేర్ నిపుణులు
- హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ నిపుణులు
- ఫార్మా రీసెర్చ్ నిపుణులు,
- క్వాలిటీ కంట్రోల్ నిపుణులు
- రెగ్యులేటరీ అఫైర్స్ నిపుణులు.
అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు?
- ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, పారామెడికల్ కోర్సులు ఠి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఠి కమ్యూనికేషన్ స్కిల్స్,
- టీమ్ వర్క్
- డేటా విశ్లేషణ నైపుణ్యం
- కంప్యూటర్ నైపుణ్యాలు
- టెక్నాలజీపై అవగాహన
- పరిశోధనా దృక్పథం
- సమస్య పరిష్కార సామర్థ్యం
- నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే తత్వం.
కొత్తగా పెరుగుతున్న అవకాశాలు
- డిజిటల్ హెల్త్
- ఏఐ ఇన్ హెల్త్ కేర్
- హెల్త్‌కేర్ డేటా అనలిటిక్స్
- బయోటెక్నాలజీ
- బయోఫార్మా
- క్లినికల్ రీసెర్చ్
- మెడికల్ డివైసెస్
- హెల్త్ ఇన్ఫర్మాటిక్స్
- టెలిమెడిసిన్
- డిజిటల్ డయాగ్నస్టిక్స్
ఎక్కడ ఉద్యోగాలు లభిస్తాయి?
- ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు
- ఫార్మాస్యుటికల్ కంపెనీలు
- డయాగ్నస్టిక్ ల్యాబ్స్
- రీసెర్చ్ సంస్థలు
- బయోటెక్ కంపెనీలు
- హెల్త్‌టెక్ కంపెనీలు
- ఫార్మా తయారీ సంస్థలు
- మెడికల్ డివైస్ కంపెనీలు
- క్లినికల్ ట్రయల్ సంస్థలు
- హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు
- ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు
- ఆరోగ్య సేవలందించే ఎన్‌జీవోలు.
యువత ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకోవాలి?
- స్థిరమైన ఉద్యోగ అవకాశాలు
- నిరంతరం పెరుగుతున్న డిమాండ్
- విభిన్న కెరీర్ మార్గాలు
- దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అవకాశాలు
- టెక్నాలజీతో కలిసిపోతున్న కొత్త ఉద్యోగాలు
- సమాజానికి ఉపయోగపడే కెరీర్
- నైపుణ్యాలు పెంచుకుంటే మంచి కెరీర్ వృద్ధికి అవకాశం
- కెరీర్ మంత్రం
![]() ![]() | ![]() ![]() | ![]() |






