Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
376 NIC Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. B.Tech, MCA, M.Sc అభ్యర్థులకు ఛాన్స్‌!

376 NIC Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. B.Tech, MCA, M.Sc అభ్యర్థులకు ఛాన్స్‌!

SAKSHI EDUCATION 1 week ago

లక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని NIC.. సైంటిఫిక్‌-టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం 376 ఖాళీలను భర్తీ చేయనుండగా.. B.E/B.Tech, M.Sc, MCA అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (NIC)లో సైంటిఫిక్‌-టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • కంప్యూటర్‌ సైన్స్‌ / ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 300 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌: 26 పోస్టులు
  • డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌: 50 పోస్టులు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో:

B.E / B.Tech ఉత్తీర్ణత
లేదా
M.Sc / M.S / MCA పూర్తి చేసి ఉండాలి.

అలాగే అభ్యర్థులకు GATE 2024 / 2025 / 2026 చెల్లుబాటు అయ్యే స్కోర్‌ తప్పనిసరిగా ఉండాలి.

NIC సైంటిఫిక్‌-టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక:

  • విద్యార్హతలు
  • GATE స్కోర్‌
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా జరుగుతుంది.

ఆన్‌లైన్‌
01 సెప్టెంబర్‌ 2026
30 సెప్టెంబర్‌ 2026

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://recruitment.nic.in

>> 291 Bank Jobs: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education