Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
470 IOCL Jobs: ఇండియన్ ఆయిల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. బీఈ, బీటెక్, MBA, LLB అర్హతలతో దరఖాస్తు చేసుకోండి!

470 IOCL Jobs: ఇండియన్ ఆయిల్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. బీఈ, బీటెక్, MBA, LLB అర్హతలతో దరఖాస్తు చేసుకోండి!

SAKSHI EDUCATION 1 month ago

ఈ నియామక ప్రక్రియలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్, ఆఫీసర్ (మార్కెటింగ్), లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, డిప్లొమా ఇంజనీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 470

  • గ్రాడ్యుయేట్ ఇంజనీర్ / ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టులు: 411
  • అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టులు: 9
  • డిప్లొమా ఇంజనీర్ గ్రేడ్-ఈ పోస్టులు: 50

పోస్టుల వారీగా అభ్యర్థులు కింది అర్హతలను కలిగి ఉండాలి.

గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టులకు:

సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత అవసరం.

డిప్లొమా ఇంజనీర్ పోస్టులకు:

ఎలక్ట్రికల్, మెకానికల్, సేఫ్టీ విభాగాల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టులకు:
MBA (Marketing)
లేదా
బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో PG Diploma
లా ఆఫీసర్ పోస్టులకు:
ఏదైనా డిగ్రీతో పాటు LLB
లేదా
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సు పూర్తి చేసి ఉండాలి.
అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులకు:

కెమిస్ట్రీ లేదా సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.

  • లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులకు రెండేళ్ల ఉద్యోగ అనుభవం తప్పనిసరి.
  • ఇతర పోస్టులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు.
  • అభ్యర్థులు సంబంధిత విద్యార్హతల్లో కనీసం 60-65 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

జూలై 1, 2026 నాటికి వయస్సు:

  • గ్రాడ్యుయేట్ ఇంజనీర్, డిప్లొమా ఇంజనీర్ పోస్టులకు: గరిష్ఠంగా 26 ఏళ్లు
  • ఆఫీసర్ (మార్కెటింగ్) పోస్టులకు: గరిష్ఠంగా 28 ఏళ్లు
  • లా ఆఫీసర్, అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ పోస్టులకు: గరిష్ఠంగా 30 ఏళ్లు
  • ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

IOCL ఉద్యోగాల్లో ఆకర్షణీయమైన వేతనాలు అందుబాటులో ఉన్నాయి.

  • గ్రేడ్-ఏ పోస్టులు: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు
  • గ్రేడ్-ఏ పోస్టులు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు
  • గ్రేడ్-ఈ పోస్టులు: నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు

అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది.

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
  • గ్రూప్ డిస్కషన్
  • గ్రూప్ టాస్క్
  • పర్సనల్ ఇంటర్వ్యూ
  • CBT పరీక్షకు 85 శాతం వెయిటేజీ
  • గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్‌లకు 5 శాతం
  • ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో రెండు విభాగాలుగా ఉంటుంది.

సెక్షన్-A:

  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 20 ప్రశ్నలు
  • లాజికల్ రీజనింగ్: 15 ప్రశ్నలు
  • వెర్బల్ ఎబిలిటీ: 15 ప్రశ్నలు

సెక్షన్-B:

అభ్యర్థి దరఖాస్తు చేసిన పోస్టుకు సంబంధించిన సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం ప్రశ్నలు: 100
ప్రతి ప్రశ్నకు: 1 మార్కు
నెగెటివ్ మార్కింగ్: తప్పు సమాధానానికి ¼ మార్కు కోత

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: 03 సెప్టెంబర్ 2026
అడ్మిట్ కార్డ్ విడుదల: 15 సెప్టెంబర్ 2026
CBT పరీక్ష తేదీ: 24 సెప్టెంబర్ 2026

వెబ్‌సైట్: https://iocl.com/latest-job-opening

>> 376 Govt Jobs: ECE, AI, CSE & IT అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. Scientific/Technical Assistant-A పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education