అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష లేదా ఫిజికల్ టెస్ట్ ఉండదు. కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
తిరుపతి సహా దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో పోస్టింగులు ఉండనున్నాయి.
AAICLAS నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులను కింది విమానాశ్రయాల్లో భర్తీ చేయనున్నారు.
- తిరుపతి ఎయిర్‌పోర్ట్ - 9 పోస్టులు
- త్రిచీ ఎయిర్‌పోర్ట్ - 23 పోస్టులు
- మదురై ఎయిర్‌పోర్ట్
- భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్
- ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్
అవసరాన్ని బట్టి ఎంపికైన అభ్యర్థులను ఇతర ఎయిర్‌పోర్ట్‌లకు కూడా బదిలీ చేసే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు అవసరం
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులు సరిపోతాయి
2026 జూన్ 1 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం:
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది
ఎంపికైన అభ్యర్థులకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆధారంగా నియామకం ఉంటుంది.
- మొదటి సంవత్సరం - రూ.21,500
- రెండో సంవత్సరం - రూ.22,000
- మూడో సంవత్సరం - రూ.22,500
ఈ వేతనం కన్సాలిడేటెడ్ పద్ధతిలో చెల్లించనున్నారు.
ఈ నియామకాల్లో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఆన్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి Career సెక్షన్‌లో Assistant (Security) Recruitment 2026 లింక్‌ను ఓపెన్ చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది:
- మొబైల్ నంబర్, ఈమెయిల్‌తో రిజిస్ట్రేషన్
- వ్యక్తిగత వివరాల నమోదు
- ఫోటో, సంతకం అప్లోడ్
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు
- ఫైనల్ అప్లికేషన్ సబ్మిట్
- జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు - రూ.500
- ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / మహిళా అభ్యర్థులకు - రూ.100
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం - 2026 జూన్ 11
- దరఖాస్తులకు చివరి తేదీ - 2026 జూలై 2
అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వెబ్‌సైట్: https://aaiclas.aero/
>> ITI అర్హతతో హైదరాబాద్‌లో 33 అప్రెంటిస్ పోస్టులు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!
![]() ![]() | ![]() ![]() |





