Saturday, 04 Jul, 4.14 pm SAKSHI EDUCATION

ఎడ్యుకేషన్ న్యూస్ / విద్య వార్తలు
ఆన్‌లైన్ బోధనను అడ్డుకోరా.. విద్యావ్యవస్థ స్తంభిస్తే నష్టమేమిటి?: టీఎస్ హైకోర్టు

ఫీజుల కోసం యాజమాన్యా లు వేధింపులకు గురిచేస్తుంటే కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఎలాగని ప్రశ్నించింది. కేంద్రం అనుమతి ఇచ్చి ఉండవచ్చునని, రాష్ట్రంలోని కరోనా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయం తీసుకోడానికి ఉన్న అడ్డంకి ఏమిటని అడిగింది. మహారాష్ట్రలో ఆన్‌లైన్ తరగతులపై నిషేధం ఉందని, మన రాష్ట్రంలో అదే విధంగా ఎందుకు చేయకూడదో చెప్పాలని కోరింది. ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులను నిర్వహించడాన్ని అడ్డుకోవాలని కోరుతూ హైదరాబాద్ పేరెం ట్స్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి కె.వి.సాయినాథ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, నేషన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌లను కూడా ప్రతివాదులుగా చేయా లని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేం ద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం ఆదేశించింది.

ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌తో నడిచే విద్యా సం స్థలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తాయని, కేంద్రం ఆన్‌లైన్ తరగతులకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. 2 మాసాలుగా ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్నాయని, విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు, రెండో ప్రపంచ యుద్ధం లో విశ్వవిద్యాలయాలు ఏమీ పనిచేయలేదని, ఇప్పుడు కరోనా కారణంగా విద్యావ్యవస్థ స్తంభిస్తే నష్టమేమిటని ప్రశ్నించింది. న్యాయవ్యవస్థ 20 శాతమే పనిచేస్తోందని, నిన్ననే జ్యుడీషియల్ అకాడమీలో ఒకరు కరోనా వల్ల మరణించారని, పేదలకు రెం డు పూటలా భోజనముంటే చాలనే పరిస్థితులు ఉన్నాయని, పనులు లేక చాలామంది ఖాళీగా ఉన్నారంది. హైదరాబాద్ పక్కనే ఉన్న నల్సార్ లా వర్సిటీలోనే ఇంటర్నెట్ సేవలు అంతంతమాత్రంగానే ఉంటాయని, గిరిజన ప్రాంతాల్లో ఆన్‌లైన్ సేవలు ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే అన్ని ల్యాప్‌టాప్‌లు సమకూర్చడం తల్లిదండ్రులకు ఎలా సాధ్యమని కూడా ప్రశ్నించింది. గిరిజన ప్రాంతాలకు వెళ్లి చూస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని, అక్కడ ఇంటర్నె ట్ ఉండదని సీబీఎస్‌ఈకి తెలియదా అని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. విద్యా సంవత్సరంలో 180 పనిదినాలు ఉండాలని, స్కూళ్లు తెరవడంపై నెల తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ నెలాఖరు వరకూ విద్యా సంస్థలను తెరవవద్దని కేంద్రం ఆదేశించిందని, అయితే ఆన్‌లైన్, దూరవిద్యలకు అనుమతి చ్చిందన్నారు. దీనికి అనుగుణంగా ముగ్గురు డీఈవోలు ఆన్‌లైన్ క్లాసులకు అనుమతి ఇ చ్చారని, అయితే ప్రభుత్వ నిర్ణయం వెలువ డే వరకూ ఏ నిర్ణయం తీసుకోరాదని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ప్రభుత్వం రెండు రకాలుగా చెప్ప డం సరికాదని, విద్యా సంవత్సరం ప్రారం భం కానప్పుడు ఆన్‌లైన్ క్లాసులను ఎలా ప్రారంభిస్తారని కోర్టు ప్రశ్నించింది. ప్రభు త్వం సబ్‌కమిటీ ఏర్పాటు చేసిందని, నివేదిక కోసం సమయమివ్వాలని సంజీవ్ కోరగా.. విచారణ ఈ నెల 13కి వాయిదా పడింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sakshi Education
Top