Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AI యుగానికి కాలేజీలు సిద్ధమా?.. QS నివేదికలో ఆందోళనకర నిజాలు!

AI యుగానికి కాలేజీలు సిద్ధమా?.. QS నివేదికలో ఆందోళనకర నిజాలు!

SAKSHI EDUCATION 1 month ago

యితే భారత ఉన్నత విద్యా వ్యవస్థ మాత్రం ఇప్పటికీ పాత సిలబస్, సంప్రదాయ బోధన విధానాలతోనే కొనసాగుతుండటంతో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను తయారు చేయలేకపోతోందని QS World Future Skills Index 2027 నివేదిక వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. కంపెనీలు AI, డేటా, సమస్య పరిష్కార నైపుణ్యాలున్న అభ్యర్థులను వెతుకుతుంటే, కాలేజీలు మాత్రం ఉద్యోగాలకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్ అందించడంలో వెనుకబడుతున్నాయి.

యూకేకు చెందిన ప్రముఖ గ్లోబల్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ సంస్థ QS విడుదల చేసిన World Future Skills Index 2027లో 89 దేశాల మధ్య భారత్ 89.4 స్కోర్‌తో 13వ స్థానం దక్కించుకుంది.

అంతేకాదు, Future of Work Readiness విభాగంలో భారత్ ప్రపంచంలోనే 5వ స్థానంలో నిలవడం విశేషం.

అయితే, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల (Skills Alignment) విషయంలో మాత్రం భారత ఉన్నత విద్యా వ్యవస్థ ఆశించిన స్థాయిలో లేదని నివేదిక స్పష్టం చేసింది.

ఈ 4 ప్రభుత్వ కళాశాలల్లో మాత్రమే Horticulture Course.. విద్యార్థులకు ఎస్‌కేఎల్‌టీయూహెచ్‌యూ కీలక సూచన!

దేశంలోని ప్రముఖ IITలు, IIMలు, AIIMS వంటి విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, మిగిలిన వేలాది విశ్వవిద్యాలయాలు, లక్షలాది మంది విద్యార్థులకు కేవలం డిగ్రీలు మాత్రమే అందిస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్‌పై తగిన శిక్షణ ఇవ్వడం లేదని QS పేర్కొంది.

దీంతో కంపెనీలు ఉద్యోగాలు ప్రకటిస్తున్నప్పటికీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులు లభించడం కష్టమవుతోందని నివేదిక హెచ్చరించింది.

Economic Support Scheme: నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీలకు స్వయం ఉపాధి అవకాశం.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే!

QS Global Employer Survey ప్రకారం, ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లపై పరిశ్రమల విశ్వాసం క్రమంగా తగ్గుతోంది.

దీనికి ప్రధాన కారణాలు:

  • పాత సిలబస్
  • పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాల లోపం
  • ప్రాక్టికల్ నాలెడ్జ్ కొరత
  • AI, డిజిటల్ టెక్నాలజీలపై పరిమిత అవగాహన

భారత్ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న దేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది.

అంచనాల ప్రకారం, 2030 నాటికి దాదాపు 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించనున్నారు.

ఈ పరిస్థితి Brain Drain (మేధో వలసలు) పెరిగే ప్రమాదాన్ని సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Goa Navy Youth Sports School: నేవీ యూత్ స్పోర్ట్స్ స్కూల్‌కు తెలంగాణ బీసీ గురుకుల విద్యార్థుల ఎంపిక.. ఉచిత విద్యతో పాటు అంతర్జాతీయ స్థాయి శిక్షణ!

QS నివేదిక ప్రకారం:

  • చైనా - 92.5 స్కోర్‌తో 7వ స్థానం
  • భారత్ - 89.4 స్కోర్‌తో 13వ స్థానం

చైనాలో STEM విద్యార్థులను నేరుగా పరిశ్రమల్లోకి తీసుకెళ్లే బలమైన వ్యవస్థ ఉండగా, భారత్‌లో పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్‌కు, కాలేజీల బోధనకు మధ్య ఇంకా భారీ అంతరం ఉందని నివేదిక పేర్కొంది.

అయితే Future of Work విభాగంలో భారత్ 96.0 స్కోర్‌తో చైనాను మించి నిలవడం సానుకూల అంశంగా గుర్తించింది.

ప్రస్తుతం ఉద్యోగ నియామకాల సమయంలో కంపెనీలు కింది నైపుణ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

  • సమస్యలను విశ్లేషించే (Problem Solving) సామర్థ్యం
  • విమర్శనాత్మక ఆలోచన (Critical Thinking)
  • సృజనాత్మకత (Creativity)
  • సమర్థవంతమైన కమ్యూనికేషన్
  • నాయకత్వ లక్షణాలు (Leadership Skills)
  • టీమ్‌వర్క్
  • భావోద్వేగ మేధస్సు (Emotional Intelligence)
  • వ్యాపార దృక్పథం (Business Mindset)
  • రిస్క్ తీసుకునే సామర్థ్యం
  • AI, డేటా అనలిటిక్స్, డిజిటల్ స్కిల్స్

AI యుగంలో కేవలం డిగ్రీ సరిపోదు. విద్యార్థులు తమ కెరీర్‌ను బలోపేతం చేసుకోవాలంటే:

  • AI టూల్స్ వినియోగం నేర్చుకోవాలి
  • ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలి
  • కమ్యూనికేషన్, లీడర్‌షిప్ స్కిల్స్ పెంపొందించుకోవాలి
  • ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు పొందాలి
  • కొత్త టెక్నాలజీలపై నిరంతరం అప్‌డేట్ అవుతూ ఉండాలి

QS World Future Skills Index 2027 నివేదిక ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో విజయం సాధించాలంటే కేవలం డిగ్రీ కాకుండా, పరిశ్రమలు కోరుతున్న ఆధునిక నైపుణ్యాలను కూడా విద్యార్థులు తప్పనిసరిగా సొంతం చేసుకోవాలి.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education