Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. వెంటనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. వెంటనే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

SAKSHI EDUCATION 18 hrs ago

ప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో, అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి అందులోని వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.

ఈ ఏడాది నిర్వహిస్తున్న ఏపీ టెట్ 2026కు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. మొత్తం 2,13,520 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 2,37,165 దరఖాస్తులు అందినట్లు టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. పరీక్షలకు ముందు అభ్యర్థుల సన్నద్ధత కోసం మాక్ టెస్టులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఏపీ టెట్ 2026 పరీక్షలు ఆగస్టు 5, 2026 నుంచి ప్రారంభమవుతాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్, బెంగళూరు, బరంపురం నగరాల్లో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష సమయాలు:

  • ఉదయం సెషన్: ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు
  • మధ్యాహ్నం సెషన్: మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు

పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగానే చేరుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

ఏపీ టెట్ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్‌ను అనుసరించండి:

  1. అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.gov.in లేదా https://tet2dsc.apcfss.in ను ఓపెన్ చేయండి.
  2. Candidate Login పై క్లిక్ చేయండి.
  3. మీ User ID (TDతో ప్రారంభమయ్యే ఐడీ) నమోదు చేయండి.
  4. దరఖాస్తు సమయంలో సెట్ చేసిన Password నమోదు చేయండి.
  5. స్క్రీన్‌పై కనిపించే Captcha Code ఎంటర్ చేయండి.
  6. Login బటన్‌పై క్లిక్ చేయండి.
  7. మీ ప్రొఫైల్‌లో Services విభాగాన్ని ఓపెన్ చేయండి.
  8. Hall Ticket ఆప్షన్‌ను ఎంచుకోండి.
  9. Download ఐకాన్‌పై క్లిక్ చేస్తే హాల్‌టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  10. హాల్‌టికెట్‌ను Download, Save లేదా Print చేసుకుని పరీక్షకు తీసుకెళ్లండి.

TOPS Scheme 2026: నెలకు ₹50,000.. TOPS స్కీమ్‌కు దరఖాస్తులు ప్రారంభం!

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసిన వెంటనే ఈ వివరాలను పరిశీలించండి:

  • అభ్యర్థి పేరు
  • రోల్ నంబర్ / హాల్‌టికెట్ నంబర్
  • ఫోటో, సంతకం
  • పరీక్ష తేదీ, సమయం
  • పరీక్షా కేంద్రం పేరు, చిరునామా
  • పరీక్షా సూచనలు

ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలి.

  • AP TET 2026 హాల్‌టికెట్ (ప్రింట్ కాపీ)
  • ఆధార్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు
  • అవసరమైన ఇతర పత్రాలు (అధికారిక సూచనల ప్రకారం)

పరీక్షా కేంద్రంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి నిషేధిత వస్తువులు తీసుకెళ్లరాదని అధికారులు స్పష్టం చేశారు. ముందుగానే హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్షా కేంద్రం వివరాలను తెలుసుకొని సమయానికి హాజరవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష రాయవచ్చు.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education