Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
APలో MBBS, BDS, PG మెడికల్ ఫీజులు పెంపు.. విద్యార్థులపై పెరగనున్న ఆర్థిక భారం!

APలో MBBS, BDS, PG మెడికల్ ఫీజులు పెంపు.. విద్యార్థులపై పెరగనున్న ఆర్థిక భారం!

SAKSHI EDUCATION 1 week ago

రాష్ట్రంలోని ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ (MBBS), బీడీఎస్‌ (BDS), పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తాజా ఉత్తర్వుల ప్రకారం ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ఫీజులను 10 శాతం పెంచగా.. పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను 15 శాతం వరకు పెంచారు.

ఈ ఫీజుల పెంపు వల్ల కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా మెడికల్‌ సీట్లు పొందే విద్యార్థులపై వార్షిక ఫీజుల భారం మరింత పెరగనుంది. ఇప్పటికే వైద్య విద్య ఖర్చులు అధికంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.

TG MBBS Counselling 2026: కన్వీనర్ కోటా ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల.. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు 10 శాతం పెంపు, పీజీ మెడికల్‌ కోర్సులకు 15 శాతం వరకు పెంపు వర్తించనుంది.

దీంతో మెడికల్‌ విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి మరింత పెరగనుంది. ముఖ్యంగా పీజీ వైద్య కోర్సులు చదివే విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రస్తుత ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసిన కాలేజీలు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) స్పష్టం చేసింది.

291 Bank Jobs: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా!

తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీజ్‌ రెగ్యులేటరీ కమిటీ (TGAFRC), నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) మార్గదర్శకాలను అన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు తప్పనిసరిగా పాటించాలని యూనివర్సిటీ ఆదేశించింది.

ఎంబీబీఎస్‌ కోర్సు అకాడమిక్‌ వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నందున.. అదే కాలానికి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని సూచించింది. ఫీజు వివాదాలు, బకాయిల పేరుతో విద్యార్థులను తరగతులకు దూరం చేయడం, చదువుకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Girls Scholarship: ఏపీలో డిగ్రీ విద్యార్థినులకు రూ.30 వేల స్కాలర్‌షిప్.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.

ఏపీలో వైద్య కోర్సుల ఫీజుల పెంపు.. తెలంగాణలో ఫీజు పెంపు లేకుండా కొనసాగింపు అనే అంశం ప్రస్తుతం మెడికల్‌ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో చర్చనీయాంశంగా మారింది.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education